Movie Theatres : సింగిల్ స్క్రీన్ లపై మల్టీప్లెక్స్ ల ఎఫెక్ట్… ఎన్ని వేల ధియేటర్లు మూత పడ్డాయంటే?

Movie Theatres : ప్రేక్షకులు సినిమాలను ఎంజాయ్ చేయాలంటే థియేటర్లు బెస్ట్ ఆప్షన్ అని  చెప్పవచ్చు. ఎంత ఓటీటీలు అందుబాటులో ఉన్నా కూడా థియేటర్లలో చూస్తే వచ్చే థ్రిల్ వేరు. అందుకే చాలామంది ఇప్పటికీ కూడా తమ అభిమాన హీరోల సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలోనే చూడడానికి ఇష్టపడతారు. అయితే ఆ థియేటర్లలో కూడా మల్టీప్లెక్స్ లు వర్సెస్ సింగిల్ స్క్రీన్స్ అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఎన్నో సింగిల్ స్క్రీన్లు మూతబడ్డాయి. మరికొన్ని థియేటర్లను మాత్రం ఇంకా రమ్ చేస్తున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సింగిల్ స్క్రీన్ లను మల్టీప్లెక్స్ లు అధిగమించబోతుండడం విశేషం. ఇలా ఇప్పటిదాకా ఈ మల్టీప్లెక్స్ లతో పోటీ పడలేక ఎన్ని వేల థియేటర్లు మూత పడ్డాయో ఓ లుక్కేద్దాం పదండి.

మూతబడుతున్న సింగిల్ స్క్రీన్లు

తాజా సమాచారం ప్రకారం మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్‌లు 2024లో సింగిల్ స్క్రీన్‌లను అధిగమించబోతున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 9,208 స్క్రీన్‌లలో, 4,745 సింగిల్ స్క్రీన్‌లు ఉన్నాయి. వాటిలో 66% దక్షిణాదిలోనే ఉన్నాయి. గత 14 ఏళ్లలో దాదాపు 5000 సింగిల్ స్క్రీన్‌లు మూతబడ్డాయి. 2023లోనే 660+ స్క్రీన్‌లు మూతబడ్డాయి. 
Can coronavirus pandemic bring single screens back in the reckoning? |  Company News - Business Standard
ఇయర్ వైజ్ చూసుకుంటే 2009లో సింగిల్ స్క్రీన్ ల సంఖ్య 9710 ఉండేది. అప్పట్లో మల్టీప్లెక్స్ లు కేవలం 9% మాత్రమే ఉండేవి. అంటే 925 మల్టీప్లెక్స్ లు మాత్రమే. అప్పటి నుంచి 2023 వరకు చూసుకుంటే రాను రాను సింగిల్ స్క్రీన్ల సంఖ్య తగ్గి మల్టీప్లెక్స్ ల సంఖ్య భారీగా పెరిగింది. 2009లో 9710 ఉన్న సింగిల్ స్క్రీన్ల సంఖ్య 2023కి వచ్చేసరికి 4745 కు పడిపోయింది. ఇక 2009లో కేవలం 925 ఉన్న మల్టీప్లెక్స్ లు సంఖ్య 2023 కి వచ్చేసరికి 4463 కు పెరిగింది. 2024 లో ఆ సంఖ్య మరింతగా పెరిగింది. రీజనల్ వైజ్ గా చూసుకుంటే సౌత్ లో 66% సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. అంటే 3114 సింగిల్ స్క్రీన్ లు ఉంటే 26% అంటే 1159 మల్టీప్లెక్స్ లు సౌత్ లో ఉన్నాయి. ఇక వెస్ట్ లో 30% అంటే ఒక వెయ్యి 324 మల్టీప్లెక్స్ ఉంటే కేవలం 11% అంటే 542 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. నార్త్ విషయానికి వస్తే అక్కడ ఏకంగా 35% అంటే 1582 మల్టీప్లెక్స్ లు ఉంటే, కేవలం 14 శాతం అంటే 662 సింగిల్ స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ఈస్ట్ లో చూసుకుంటే 398 మల్టీప్లెక్స్ ఉంటే 427 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఈ అనాలిటిక్స్ చూసుకుంటే నార్త్ లో సింగిల్ స్క్రీన్లు త్వరలోనే పూర్తిగా మాయమయ్యే ఛాన్స్ ఉంది. ఇలా రోజు రోజుకు భారతదేశంలో సింగిల్ స్క్రీన్ ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రేక్షకులు కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్ లోనే సినిమాలు చూడడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇదే కారణమా?

మల్టీప్లెక్స్ లలో టికెట్ల రేట్లు ఆకాశాన్ని తాకినా సరే కంఫర్ట్ రేంజ్ కూడా అలాగే ఉంటుంది. అలాగే డోల్బీ సౌండ్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో సినిమాను చూస్తున్నంత సేపు వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. లగ్జరీతో పాటు కావాల్సిన స్నాక్స్, షాకింగ్ సౌకర్యం దొరుకుతాయి. కానీ ఈలలు వేసి గోల చేసి థియేటర్లను షేక్ చేసే సత్తా మాత్రం సింగిల్ స్క్రీన్ లకే ఉంటుంది అన్నది వాస్తవం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు