SreeLeela : ముందుగా అది శ్రీలీలే చేయాల్సింది.. రిజెక్ట్ చేసి మంచిదయింది..

SreeLeela : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ స్టార్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం హై డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల టాప్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ కి, మీడియం రేంజ్ స్టార్ హీరోలకు క్రేజ్ ఉన్న హీరోయిన్ల పరంగా శ్రీ లీల ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ, వెంటనే ధమాకా తో బ్లాక్ బస్టర్ కొట్టగా రీసెంట్ గా గుంటూరు కారంతో మరో విజయం అందుకుంది. అయితే మధ్యలో పలు సినిమాలు ప్లాప్ అయినా, శ్రీ లీల కి వచ్చిన డోకా ఏమి లేదు. ప్రస్తుతం అరడజను సినిమాలలో శ్రీ లీల (SreeLeela) ఫుల్ బిజీగా ఉంది. అందులోనూ నాలుగు సినిమాలు తెలుగువే కావడం విశేషం. ఇదిలా ఉండగా శ్రీ లీల రీసెంట్ గా ఓ సినిమా రిజెక్ట్ చేసి మంచిపని చేసిందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

Sreeleela rejected a special song in Vijay starrer 'Goat' movie

ముందుగా దీంట్లో ఫస్ట్ ఆప్షన్ శ్రీలీలే..

ఇక శ్రీ లీల ప్రస్తుతం తెలుగు సినిమాలతోనే బిజీగా ఉండగా, రీసెంట్ గా ఓ తమిళ స్టార్ సినిమాని శ్రీ లీల రిజెక్ట్ చేసి మంచిపని చేసిందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయ్. ఇంతకీ ఆ సినిమా ఏదంటే, దళపతి విజయ్ నటించిన “గోట్” (Goat) సినిమా. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్పెషల్ సాంగ్ ఆఫర్ ఫస్ట్ శ్రీ లీలకు వచ్చిందట. అయితే అప్పటికే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న శ్రీ లీల తమిళ్ లో హీరోయిన్ గానే ఎంట్రీ ఇద్దామని ఫిక్స్ అయి. గొట్ లో స్పెషల్ సాంగ్ రిజెక్ట్ చేసిందని సమాచారం. కారణాలేవైనా గోట్ సినిమా ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, ఆ సాంగ్ కి కూడా పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో శ్రీ లీల ఆ సాంగ్ ని రిజెక్ట్ చేసి మంచిపని చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీ…

ఇక శ్రీ లీల సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో శ్రీ లీల నటించిన పలు సినిమాలు ఆశించిన అంచనాలు అందుకోకపోయినా, ఈ అమ్మడి ఆఫర్లకేమి కొదవలేదు. ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తుండగా, అందులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad bhagath singh) ఉండనే ఉంది. ఇక నితిన్ తో రాబిన్ హుడ్, రవితేజ 75th సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా, కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక్కటి హిట్ అయినా శ్రీ లీల మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు