Raj Tharun – Lavanya : మొన్న నాకు కావాలంది.. నేడు వద్దంటుంది.. లావణ్య గురించి వెలుగులోకి నిజం..

Raj Tharun – Lavanya : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun )- లావణ్య ( Lavanya ) ల పేర్లు గత కొన్నిరోజులుగా మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. తనని శారీరకంగా వాడుకొని వదిలేశాడని ఆరోపిస్తూ లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. ఆ కేసు ఎన్నో ట్విస్టులతో నిన్నటీకి ఎండ్ కార్డు పడింది. అయితే ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ వద్దు అంటూ చెబుతుంది. ఇదేం ట్విస్ట్ అనే అనుమానం కలుగుతుంది కదూ.. అసలు ఆమె ఎందుకు అలా చెప్పిందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

గత కొన్ని నెలల క్రితం హీరో రాజ్ తరుణ్ – లావణ్య- మాల్వీ మల్హోత్రా ( Malvi Malhotra )వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్‌తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కొద్దిరోజులు రెండు వర్గాలు సైలెంట్ కావడంతో కేసు ముగిసిపోయిందనుకున్నారు. అయితే పోలీసులు దూకుడుగా ఉండటంతో రాజ్ తరుణ్ కేసు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై పలు సెక్షన్స్ నమోదు చేశారు. విచారణ జరిపి సంచలన విషయాలను బయట పెట్టారు. ఈ క్రమంలో రీసెంట్ గా లావణ్య ఆరోపణలు నిజమని రుజువైంది..

lavanya shocking comments on raj tharun
lavanya shocking comments on raj tharun

రాజ్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకుని తన షూటింగ్స్‌లో బిజీ అయ్యాడు. ఇలాంటి దశలో పోలీసులు శుక్రవారం ఈ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఇందులో ఏకంగా రాజ్‌తరుణ్‌ని నిందితుడిగా చేర్చడం కలకలం రేపింది. లావణ్య చెబుతున్న దానిలో వాస్తవాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించినట్లుగా పేర్కొన్నారు.. ఈ క్రమంలో లావణ్య రీసెంట్ గా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

- Advertisement -

లావణ్య మాట్లాడుతూ.. 100 పర్సెంట్ రాజ్ నన్ను మోసం చేశాడని, తాళి కట్టలేదని మీడియాతో చెబుతున్నాడని ఆయనకు శిక్ష పడాలి , జైలుకెళ్లాలని లావణ్య తేల్చిచెప్పారు. చేయని నేరానికి తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని మస్తాన్ సాయితో కాల్ మాట్లాడినందుకే ఇలా జరిగిందని ఆమె అన్నారు. అయితే రెండ్రోజుల క్రితం రాజ్ తనకు దక్కితే చాలని, ఆయన జైలుకెళ్లాలన్నది తన ఉద్దేశం కాదన్న లావణ్య ఇంతలోనే మాట మార్చడం ఏంటంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం లావణ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారాయి.. ఇది అంతా చూస్తుంటే ఏదో మూవీ కోసం చేస్తున్నారా? అనే సందేహాలు కూడా జనాలకు వస్తున్నాయి. చూద్దాం చివరికి ఏమౌతుందో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు