Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు అలాంటి సమస్య.. ఏమైందంటే..?

Renudesai.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణూ దేశాయ్(Renu Desai) భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్న తెలిసిందే. పిల్లల ఆలనా పాలనా చూసుకోవడమే కాదు అనాధలు, జంతువులు, పక్షులు ఇలా వాటిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటుంది. ఇక సమాజంలో జరిగే ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ.. తనదైన శైలిలో వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్ద గుమ్మ. గతంలో తాను తన భర్త పక్కన హీరోయిన్ గా నటించడమే కాదు తన భర్త పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది.

Renu Desai: What happened to Pawan Kalyan's ex-wife?
Renu Desai: What happened to Pawan Kalyan’s ex-wife?

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రేణు దేశాయ్..

ఇక భర్త నుంచి విడిపోయిన తర్వాత శాశ్వతంగా సినిమాలకు దూరమైన ఈమె ఇటీవల రవితేజ (Raviteja )హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ రీ యంట్రీ ఇచ్చింది. ఇందులో హేమలత లవణం అనే క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించి మెప్పించింది రేణూ దేశాయ్. ఈ సినిమాతో మంచి మార్కులు వేసుకున్న ఈ అమ్మడు మళ్లీ సినిమాలలో నటించలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీంతో అభిమానులు అసలు రేణూ దేశాయ్ కి ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

భయం వేస్తోందన్న రేణూ దేశాయ్.

తాజాగా ఒక పోస్ట్ పెట్టిన ఈమె.. అందులో తన ఆరోగ్యం బాగాలేదని తెలిపింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేణూ దేశాయ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆరోగ్యం బాగా లేకపోవడం పెద్ద సమస్య కాదు. పైగా ఇది వైరల్ జ్వరాల కాలం కాబట్టి జ్వరంతో బాధపడే ప్రమాదం ఉంది కానీ ఇక్కడ పాయింట్ అది కాదని చెప్పవచ్చు. ఈమెకు పెద్ద ఆరోగ్య సమస్య ఉండటం గమనార్హం. ఈమె పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టిందట. ఈమె నానమ్మ 47 ఏళ్లకే గుండెజబ్బుతో మరణించింది. ఈమె తండ్రి కూడా చాలా తక్కువ వయసులోనే గుండె జబ్బుతో చనిపోయారు. ఇప్పుడు అదే సమస్య రేణు దేశాయ్ ని కూడా వెంటాడుతోందట. అందుకే ఎప్పటికప్పుడు ఈమె హెల్త్ చెకప్ చేయించుకుంటూ గుండె వేగం పెరగకుండా మందులు కూడా వాడుతోందట. ఇలాంటి టైంలో తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ తాజాగా ఒక పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు

- Advertisement -

భారతీయుడు -2 పై షాకింగ్ కామెంట్స్..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జంతు ప్రేమికురాలిగా పేరు తెచ్చుకోవడమే కాదు.. జంతువుల పట్ల ప్రేమగా ఉండాలని కూడా అందరికీ చెబుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో భారతీయుడు -2 సినిమాలో వీధి కుక్కల పై పెట్టిన అభ్యంతర డైలాగ్స్ కి స్పందిస్తూ.. ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది రేణు దేశాయ్. ఏది ఏమైనా ఈమె ఇప్పుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది అని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు