Kannappa : అక్షయ్ కుమార్ బర్త్ డే ట్రీట్… స్పెషల్ పోస్టర్ తో కన్నప్ప విషెస్

Kannappa : మోస్ట్ అవెయిటింగ్ పాన్ ఇండియా సినిమా కన్నప్ప నుంచి తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అందులో ఆయన నటిస్తున్న పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు. మరి ఆ పోస్టర్ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

కన్నప్ప నుంచి స్పెషల్ పోస్టర్

మంచు విష్ణు హీరోగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ కన్నప్ప, ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, నయనతార, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటీనటులు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆయన ఇందులో శివుడిగా కనిపించబోతున్నారు. ఆయనకు ఇదే డైరెక్ట్ తెలుగు మూవీ కావడం విశేషం. ఇప్పటికే సినిమాలో అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ చిత్రబృందం అక్షయ్ ను విష్ చేసింది. అయితే అందులో అక్షయ్ లుక్ ను రివీల్ చేయలేదు. అలాగే గతంలో రిలీజైన కన్నప్ప గ్లిమ్స్ లో కూడా శివుడి పాత్రకు సంబంధించిన లుక్ ను దాచి, కేవలం కళ్ళను మాత్రమే చూపించారు మేకర్స్. మరి ఆయన లుక్ ను ఎప్పుడు రివీల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కానీ తాజాగా కన్నప్ప రిలీజ్ చేసిన పోస్టర్ తో అక్షయ్ కుమార్ కు టాలీవుడ్ మూవీ లవర్స్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీని ఒకేసారి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తుండడంతో తాజాగా అక్షయ్ కుమార్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. అందులో ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు, భక్తికి మాత్రం దాసుడు అనే కొటేషన్ కూడా ఉంది. అలాగే కేవలం అందులో ఆయన చేతికి ఉన్న రుద్రాక్షను హైలెట్ చేశారు మేకర్స్.

Image

- Advertisement -

ఆశలన్నీ ఈ మూవీపైనే ?

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలన్నీ ఇటీవల కాలంలో డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆయన. మరి ఈ మూవీ అయినా అక్షయ్ కష్టాలను తీరుస్తుందా ? అనేది చూడాలి. నిజానికి అక్షయ్ కు మాత్రమే కాదు చాలామంది స్టార్స్ కు కన్నప్ప ప్రత్యేకమే. హీరోగా నటిస్తున్న మంచు విష్ణుకు కూడా చాలా కాలంగా ఒక్క హిట్ కూడా లేదు. ఆయన కూడా ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ లాంటి దిగ్గజ నటులను కూడా రంగంలోకి దింపారు. ఇందులో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో 11 నిమిషాల పాటు కనిపించనున్నారు. అలాగే ఈ మూవీతోనే మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా చిత్రసీమలోకి కాలు పెట్టనున్నారు. అందుకే కన్నప్ప రిలీజ్ గురించి మూవీ లవర్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు