KA : కిరణ్ అబ్బవరం “క” ను కేరళలో రిలీజ్ చేస్తున్న మలయాళ స్టార్ హీరో!

KA : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించి ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమవగా, మొదటి సినిమాతోనే ఆకట్టుకోగా, SR కళ్యాణమండపం సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం, భారీ ప్లాప్ లను అందుకుని డీలా పడ్డాడు. అయితే లాస్ట్ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఓ మోస్తరు సెమి హిట్ ని అందుకున్న కిరణ్ మళ్ళీ డిజాస్టర్లు అందుకున్నాడు. మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు ప్రేక్షకులని ఏమాత్రం అలరించలేదు. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో “క” (KA) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Dulquer Salmaan is promoting Kiran Abbavaram's movie "Ka"

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “క”..

ఇక కిరణ్ అబ్బవరం నటిస్తున్న “క” సినిమాను శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్, కే ఏ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్ & సుజీత్ అనే ఇద్దరు దర్శకులు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. రీసెంట్ గా “క” సినిమా కోసం, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం, మేకర్స్ కి ఏకంగా 12 కోట్ల ఆఫర్ చేసిందట. నిర్మాతలు కూడా వెంటనే డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా “క” సినిమా ఇతర భాషలకు సంబంధించిన రిలీజ్ అప్డేట్స్ రాగా, తాజాగా మలయాళం వెర్షన్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

- Advertisement -

“క” ను మలయాళం లో రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో…

ఇక కిరణ్ అబ్బవరం “క” సినిమా మలయాళం వెర్షన్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అయితే “క” సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులని నిర్మాత వంశీ నందిపాటి దక్కించుకున్నారని సమాచారం. అయితే మలయాళం వెర్షన్ ని ఓ స్టార్ హీరో నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఆ స్టార్ ఎవరో కాదు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కి చెందిన “వేఫేరర్ ఫిల్మ్స్” (WayFarer Films) వారు KA యొక్క మలయాళ వెర్షన్‌ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేరళలో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని ప్రమోట్ చేయడం మేకర్స్ కి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక “క” చిత్రంలో నయన్ సారిక (Nayan Sarika) మరియు తన్వి రామ్ హీరోయిన్లుగా నటించగా, సుజిత్ & సందీప్ ద్వయం దర్శకత్వం వహించిన “క” విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. అతి త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం గట్టిగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు