Breaking News : ఇట్స్ అఫిషియల్.. భార్యతో విడాకులు తీసుకోబోతున్న హీరో..

Jayam Ravi : ఈమధ్య తమిళ నాట సెలెబ్రేటీల విడాకులు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది జంటలు విడాకులు తీసుకున్నారు. మొన్న ధనుష్ (Dhanush) – సౌందర్య (Soundarya) విడాకులు తీసుకోవడం పెద్ద చర్చనీయంశంగా మారింది. ఇప్పుడు మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుబోతున్నారు. ఈ జంట విడాకుల గురించి గతంలో చాలా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఆ జంట మరెవ్వరో కాదు.. తమిళ స్టార్ హీరో జయం రవి-ఆర్తి దంపతులు. అయితే, భార్యాభర్తలు ఇద్దరూ తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి ఫొటోలు తీసివేశారు. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్నది.. తాజాగా ఆ వార్తను నిజం చేశారు జంట. జయం రవి తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుండటంతో తమిళ నాట ఓ రేంజులో చర్చనీయాంశంగా మారింది.

Jayam Ravi is about to divorce his wife
Jayam Ravi is about to divorce his wife

హీరో జయం రవి ( Jayam Ravi ) ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నాడు. గతేడాది వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌లో మెరిశాడు. జయం రవి 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్తి ( Arthi ) ప్రముఖ టెలివిజన్‌ నటి సుజాత కూతురు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లు ఉన్నారు. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది.. మొన్నీ మధ్య విడాకుల రూమర్స్ వినిపించాయి. కానీ వీరి సన్నిహితులు మాత్రం ఆ వార్తలను కొట్టిపడేసారు.

- Advertisement -

నిజానికి హీరో జయం రవి ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి భార్య, ఫ్యామిలీ ఫొటోలు డిలీట్‌ చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అలాగే, ఆర్తి సైతం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి ఫొటోలు డిలీట్‌ చేసింది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. గతకొంతకాలంగా ఇద్దరూ వేరుగా ఉంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. భార్య కు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరి ఎప్పుడు వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారో తెలియలేదు.. కానీ ఈ వార్త మాత్రం ఇటు సోషల్ మీడియాలో, అటు తమిళ మీడియాలో తెగ వినిపిస్తుంది. తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పై ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు