South Actors : ఒకే సినిమాలో హీరోలుగా, విలన్లుగా నటించిన సౌత్ స్టార్స్ వీళ్ళే

South Actors : సౌత్ లో ఎంతోమంది మల్టీటాలెంటెడ్ హీరోలు ఉన్నారు. అయితే స్టార్స్ ఒకే సినిమాలో హీరోగా, విలన్ గా ద్విపాత్రాభినయం చేయడం అనేది మాత్రం చాలా అరుదు. మరి ఇలా ఒకే సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు చేసి ఆకట్టుకున్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.

జూనియర్ ఎన్టీఆర్ – జై లవకుశ

2017లో కేఎస్ రవీంద్ర దర్శకత్వం వచించిన జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు. అందులో ఒక పాత్రలో స్మార్ట్ గా, రెండో పాత్రలో కాస్త మెతగ్గా, నెగెటివ్ షేడ్ ఉన్న మూడో పాత్రలో భీబత్సంగా నటించి ఆకట్టుకున్నాడు.

బాలకృష్ణ – సుల్తాన్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన సుల్తాన్ మూవీ 1999 మే 27న రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య హీరోగానే కాకుండా విలన్ గా 11 రకాల గెటప్ లలో అలరించారు. ఇందులో కృష్ణం రాజు, కృష్ణ వంటి లెజెండరీ యాక్టర్స్ అతిథి పాత్రలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

NBK - Sultan: 22 యేళ్ల కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణల మల్టీస్టారర్  'సుల్తాన్'.. – News18 తెలుగు

వెంకటేష్ – నాగవల్లి

చంద్రముఖి లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి మూవీ వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 2010లో రిలీజైన ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్ డాక్టర్ విజయ్, నాగ భైరవ రాజశేఖర అనే డ్యూయల్ రోల్స్ చేశారు.

నాని – జెండాపై కపిరాజు

నాని హీరోగా 2015లో రిలీజైన ఈ సినిమాకు సముద్రకని దర్శకత్వం వహించారు. ఇందులో నాని అరవింద్ శివ శంకర్, మాయకృష్ణన్ అనే రెండు పాత్రల్లో నటించారు. అందులో ఒకటి హీరో రోల్ అయితే, రెండోది విలన్ రోల్.

గోపీచంద్ – గౌతమ్ నంద

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా గౌతమ్ నంద. 2017లో రిలీజైన ఈ సినిమాలో గోపీచంద్ రిచ్ పర్సన్ గౌతమ్, పూర్ పర్సన్ నందగా నటించాడు. ఒకానొక టైంలో ఒకే రూపంలో ఉన్న వీళ్ళిద్దరూ తమ స్థానాలను మార్చుకుంటారు. కానీ ఆ తరువాత నంద గౌతమ్ ను చంపాలని చూస్తాడు. స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా మూవీ హిట్ కాలేదు.

Watch Goutham Nanda (2017) Full Movie Online - Plex

విశ్వక్ సేన్ – దాస్ కా దమ్కి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన మూవీ దాస్ కా దమ్కి. ఈ సినిమాలో విశ్వక్ ద్విపాత్రాభినయం చేశాడు. 2023లో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

కమల్ హాసన్ – దశావతారం

లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన దశావతారం సినిమాలో ఏకంగా 10 పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. అందులో విలన్ పాత్ర కూడా ఒకటి. 2008లో రిలీజైన ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, కమల్ కెరీర్లో, ఇండియన్ సినిమా హిస్టరీలో మరిచిపోలేని మూవీగా మిగిలింది దశావతారం.

Dasavatharam completes 13 years: Kamal Haasan shares insight from making of  the film

అజిత్ – వాలి

ఎస్జె సూర్య దర్శకత్వం వహించిన వాలి మూవీ 1999లో రిలీజ్ కాగా, ఇందులో అజిత్ శివ, దేవా అనే అన్నదమ్ములుగా నటించాడు. ఒకే పోలికలతో ఉండే ఇద్దరూ ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటారు.

సూర్య – 24

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 24 మూవీ 2016లో తెరపైకి వచ్చింది. టైం మెషిన్ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేశారు. కానీ 24 సినిమా పెద్దగా ఆడలేదు.

Surya's 24 Movie Stills and Posters

కార్తి – కాష్మోర

కార్తీ హీరోగా గోకుల్ దర్శకత్వం వహించిన హారర్ మూవీ కాష్మోర. పాస్ట్, ప్రజెంట్ కు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. కార్తీ కాష్మోరా, రాజ్ నాయక్ పాత్రల్లో కనిపిస్తాడు.

విజయ్ – ది గోట్

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది గోట్ సినిమాలో దళపతి విజయ్ కూడా ద్విపాత్రాభినయం చేశాడు. ఏఐ టెక్నాలజీని వాడి యంగ్ విజయ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు