Devara : దేవర కోసం ”వర”.. టైం కూడా ఫిక్స్ చేసేశారు..

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కూడా సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేయగా, విడుదల రోజు దగ్గరవుతున్న కొద్దీ అభిమానుల్లో ఆతృత పెరిగిపోతుంది. ఇటు చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లలో వేగం పెంచింది. రీసెంట్ గా మూడో సాంగ్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ప్రస్తుతం అందరి కళ్ళు దేవర ట్రైలర్ పైనే ఉన్నాయి.

Devara Trailer Release Update

ట్రైలర్ టైం కూడా ఫిక్స్..

ఇక దేవర సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ డేట్ ని గుర్తు చేస్తూ మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ ముందు నిల్చుని ఉంటే, కత్తిని పట్టుకుని ఉన్న మరో బ్యాక్ లుక్ ని కూడా పోస్టర్ లో చూపించగా, ఆ పోస్టర్ లో దేవర (Devara) ట్రైలర్ సెప్టెంబర్ 10 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక అనౌన్స్ మెంట్ లో “దేవర” కోసం “వర” వస్తున్నాడంటూ మేకర్స్ ప్రకటించారు. అంటే ఇవి తండ్రి కొడుకుల పాత్రల పేర్లు అయి ఉండొచ్చని సమాచారం. ఇక ట్రైలర్ తో సినిమాపై అన్ని భాషల్లో అంచనాలు పెరిగిపోవడం ఖాయమని తెలుస్తూనే ఉంది.

- Advertisement -

ట్రైలర్ తో రికార్డులు బద్దలు ఖాయం?

ఇక దేవర ట్రైలర్ (Devara Trailer) కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తుండగా, దేవర ట్రైలర్ తో తారక్ కొత్త రికార్డ్స్ సృష్టిస్తాడని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇంతకు ముందు ట్రైలర్ పరంగా హైయెస్ట్ వ్యూస్ సలార్ (Salaar) ట్రైలర్ కి ఉండగా దాన్ని దేవర బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక దేవర సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ రాబట్టగా, వరల్డ్ వైడ్ గా డే 1కే 150 కోట్ల ఓపెనింగ్స్ కొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవర ట్రైలర్ వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు