Bigg Boss 8 Telugu: బేబక్క అన్న టాలీవుడ్ నటుడే.. ఎవరో తెలుసా?

Bigg Boss 8 Telugu: బుల్లితెర పై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ప్రసారం అవుతుంది. గత వారం గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షో ఒకవారం పూర్తి చేసుకుంది. ఇప్పుడు మొదటి ఎలిమినేషన్ ను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బెజవాడ బేబక్క ( Bejawada Bebakka ) ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఈమె వచ్చినప్పటికన్నా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎవరి కూతురు? ఆమె అన్న టాలీవుడ్ నటుడు అని వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజులో చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌, నటి బెజవాడ బేబక్కకు క్రేజ్ ఎక్కువే.. అదే క్రేజ్ తో ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకవారం తన సత్తాను చాటుకుంది. నిన్న సండే జరిగిన ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆమె బ్యాక్ డ్రాప్ గురించి తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లువడుతున్నాయి. ఆమె అన్నయ్యకు ఇండస్ట్రీతో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. ఇక వాళ్ల పెద్ద నాన్న గురించి తెలిస్తే.. మీరు కూడా షాక్ కావాల్సిందే. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

bigg boss 8 telugu Bebakka brother is a Tollywood actor..
bigg boss 8 telugu Bebakka brother is a Tollywood actor..

ఈ బెజవాడ బేబక్కయూట్యూబ్ లో సంచలనం అని అందరికీ తెలిసిందే.. ఈమె నటిగా, సింగర్‌గా, కమెడియన్‌గా, మిమిక్రీ కళాకారిణిగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. కరోనా టైంలో తన ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌తో చాలా ఫేమస్ గా మారింది . బేబక్కది మన విజయవాడనే. ఆమె పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆ తరువాత అక్కడే ఉద్యోగం చేస్తూ అమెరికాలో స్థిరపడింది. కరోనా సమయంలో ఉద్యోగం మానేసి.. యాక్టర్ గా అవతారమెత్తింది. ఇప్పటి వందలా షోలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ( Ilayaraja ) కంపోజింగ్‌లో పలు సాంగ్స్ పాడింది. ఎన్ని చేసినా ఆమెకు ఇప్పటికి సరైన గుర్తింపు రాలేదు. ఇలా ఆమె గురించి తెలుసుకున్న వారంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇక డైరెక్టర్ రాఘవేంద్ర రావు ( Ragavendra Rao )ఈమెకు స్వయానా పెద్దనాన్న.. బేబక్క అమ్మ వాళ్ల అక్కనే ఆయన పెళ్లి చేసుకుంది. బేబక్కకు ఓ అన్నయ్య గా కూడా ఉన్నారు. అతని పేరు వంశీ నెక్కంటి ( Vamshi Nekkanti ) . ఆయన టాలీవుడ్ నటుడు. ఖలేజా, వంగవీటి, పుష్ప, రణరంగం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి ఒక వ్యాపార వేత్త.. ఇప్పుడు తండ్రి లేడు. తల్లి అన్నయ్యతోనే ఆమె ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు