Devara: పాపం ఏదైనా దేవర సినిమాకి సమస్యే

Devara: కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. అలానే ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఎన్టీఆర్ కంటే కూడా కొరటాల శివకి హిట్ అవ్వటం చాలా అవసరం. ఎందుకంటే మిర్చి(Mirchi) సినిమాతో దర్శకుడుగా పరిచయమైన శివకి వరుసగా నాలుగు హిట్ సినిమాలు ఉన్నాయి. వరుసగా 4 హిట్ సినిమాలు పడటంతో చిరంజీవి వంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం దక్కింది.

చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేయాలని ఎంతో మంది దర్శకులు కలలు కన్నారు కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఆ కల కొరటాల శివకు నెరవేరిన గాని అది ఒక పీడకల అయిపోయింది. అప్పటివరకు కొరటాల శివ సాధించుకున్న పేరు అంతా కూడా పోయింది. కేవలం పేరు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు కొరటాల శివ. ఇక ప్రస్తుతం దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ మరియు పాటలు కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి.

ఇకపోతే ఇప్పుడు దేవర సినిమాకి మరో సమస్య కూడా ఉంది. రాజమౌళి తో పనిచేసిన హీరోతో ఏ దర్శకుడు సినిమా చేసినా కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొరటాల శివ వంతు వచ్చింది. ఇదివరకే ఆచార్య సినిమా కూడా ఇలానే ఫెయిల్ అయింది. ఇప్పుడు దేవర సినిమా ఫెయిల్ అయితే రాజమౌళి సెంటిమెంట్ అంటారు. అంతేకాకుండా కొరటాల శివ కు ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ మెయిన్ హీరో కాదు సైడ్ హీరో అందువలన ఈ సినిమా వర్కౌట్ అయింది అని కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. ఎటు చూసినా కూడా ఈ సినిమాకి విమర్శలు తప్పదు అనేటట్లు ఉంది.

- Advertisement -

Devara

ఇకపోతే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలనే ఉంచుతుంది. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ అదరగొడుతుంది. ఎన్టీఆర్ ఎనర్జీని కరెక్ట్ గా మ్యాచ్ చేయగలుగుతుంది అని కూడా చెప్పొచ్చు. అలానే అనిరుద్ అందించిన ట్యూన్స్ మొదటి కొంత మేరకు ట్రోల్స్ కు గురి అయిన కూడా ఆ తర్వాత అవి చాట్ బస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి హిట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు