Devara Fight Sequence : 100 రోజులు నీళ్లలోనే… అండర్ వాటర్ ఫైట్‌కి తారక్ కష్టం మామూలుగా లేదుగా..

Devara Fight Sequence.. జనతా గ్యారేజ్, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తాజాగా ఎన్టీఆర్ (NTR) తో మరొకసారి జతకట్టారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హై యాక్షన్ ఎంటర్టైన్ చిత్రం దేవర. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా మొన్న ముంబైలో చాలా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు చిత్ర బృందం. ఆద్యంతం ట్రైలర్ ఆకట్టుకుంటూ సినిమాపై హైప్ పెంచేసింది. ఇకపోతే ప్రస్తుతం నార్త్ లో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టం గురించి చెప్పుకొస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

Devara Fight Sequence : 100 days under water... Tarak's difficulty is not usual for an underwater fight..
Devara Fight Sequence : 100 days under water… Tarak’s difficulty is not usual for an underwater fight..

ఆ షాట్ సినిమాకే హైలెట్..

ఇకపోతే ట్రైలర్ ద్వారా కొంత కథ చెప్పి ప్రేక్షకులను ప్రిపేర్ చేసి ఉంచాలని అనుకున్నారో ఏమో కానీ అభిమానులు కోరుకున్న హై మూమెంట్స్ అయితే ఇందులో కనిపించలేదు. అలాగే సీజీ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నిరాశపరిచినట్టు అందరూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఇవన్నీ ఎలా ఉన్నా సరే ట్రైలర్ చివరలో ఒక షాట్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో సొర చేపపై ఎన్టీఆర్ కూర్చోవడం, ఆ తర్వాత అది పైకి ఎగరడం..దాని సహాయంతో ఎన్టీఆర్ ప్రత్యర్థులపై దూకడం వంటి వాటిని మనం ట్రైలర్లో గమనించవచ్చు. అయితే ఈ షాట్ గురించి కొంతమంది నెగటివ్ కామెంట్లు చేస్తుంటే, మరికొంతమంది గూస్ బంప్స్ తెప్పించే షాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ షాట్ కోసం టీం ఎలా కష్టపడింది..? దీని వెనుక ఉన్న కథ ఏంటి ..? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

షార్క్ షాట్ కోసం ఒకటిన్నర రోజు నీళ్లలో ఉండిపోయిన ఎన్టీఆర్..

ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ చివర్లో వచ్చే సొర చేప షాట్ కోసం ఎన్టీఆర్ దాదాపు ఒకటిన్నర రోజు అండర్ వాటర్ లోనే ఉన్నారట. ఈ ఒక్క షాట్ కోసం దాదాపుగా ఒకటిన్నర రోజు కష్టపడినట్లు సమాచారం. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ కోసం పనిచేసిన సాల్మన్ ఈ సీక్వెన్స్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

100 రోజులు అండర్ వాటర్ లోనే..

అంతేకాదు దేవర మొదటి భాగం దాదాపు 100 రోజులపాటు అండర్ వాటర్ లోనే చిత్రీకరించారట. దీనికోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు అండర్ వాటర్ సీక్వెన్స్ ఎపిసోడ్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తారని వార్త వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ విషయాలన్నీ వింటూ ఉంటే దేవరా టీం ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతుంది. మరి వీరికి కష్టానికి తగిన ఫలితం లభించాలి అంటే సెప్టెంబర్ 27 వరకు ఎదురు చూడాల్సిందే. మరి దేవర ప్రస్తుతం ఎన్నో రకాల నెగిటివిటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు