Guru Charan : ప్రముఖ టాలీవుడ్ గీత రచయిత గురు చరణ్ ఇకలేరు… అనారోగ్యంతో కన్నుమూత

Guru Charan : ప్రముఖ తెలుగు పాటల రచయిత గురు చరణ్ కన్నుమూత టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆకస్మిక మరణం పలువురు సినీ ప్రముఖులను కలచివేస్తోంది. ప్రస్తుతం గురుచరణ్ కు 77 సంవత్సరాల వయసు కాగా, అనారోగ్య సమస్యలతో ఆయన గురువారం ఉదయం ఆకస్మికంగా కన్ను మూసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురు చరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

గురు చరణ్ తండ్రి ప్రముఖ డైరెక్టర్

గురు చరణ్ నిజానికి మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే చిత్ర పరిశ్రమలోకి కాలు పెట్టారు. సాధారణంగా స్టార్ కిడ్స్ ఎక్కువగా హీరోలుగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో వారసత్వాన్ని నిలబట్టాలి అనుకుంటారు. కానీ తన తండ్రి స్వయంగా డైరెక్టర్ అయినప్పటికీ సినిమాల వైపు కాకుండా పాటల రచయితగా చిత్ర సీమలోకి అడుగు పెట్టడానికే గురు చరణ్ మక్కువ చూపించారు. గురు చరణ్ తండ్రి ప్రముఖ డైరెక్టర్ మానపురం అప్పారావు. తల్లి పాపులర్ నటి ఎంఆర్ తిలకం. ఇలా ఓవైపు తండ్రి, మరోవైపు తల్లి అండ ఉన్నప్పటికీ గురు చరణ్ నటన వైపు ఆసక్తిని చూపించలేదు. ఎంఏ చదివాక ఒకప్పటి లెజెండరీ సాంగ్ రైటర్ ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యుడిగా చేరారు. అనంతరం పాటల రచయితగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 200 కు పైగా సినిమాల్లో ఎన్నో పాటలకు లిరిక్స్ అందించారు. ఆయన రాసిన పాటలు టాలీవుడ్ చరిత్రలో ఎన్నటికీ మరిచిపోలేనివి.

- Advertisement -

మోహన్ బాబుకు గురుచరణ్ సెంటిమెంట్

సినీ పరిశ్రమలో కొంతమంది హీరోలకు కొన్ని సెంటిమెంట్ లు ఉంటాయి. ఆ హీరోతో కలిసి లేదా ఫలానా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లతో కలిసి పని చేస్తే తమ సినిమా హిట్టే అనే నమ్మకంతో ఉంటారు. అలా టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబుకు గురు చరణ్ అంటే అప్పట్లో ఒక సెంటిమెంట్ ఉండేదట. అందుకే ఆయన తను చేసే ప్రతి సినిమాలోనూ గురు చరణ్ తప్పకుండా ఒక పాట రాయాలని పట్టుబట్టే వారట. అందులో భాగంగానే ముద్దబంతి పువ్వులో మూగ భాషలు, కుంతి కుమారి తన కాలుజారి, బోయ గాడి వేటకు గాయపడిన కోకిల వంటి చిరస్మరణీయమైన పాటలు మోహన్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ తరం యూత్ కు గురు చరణ్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ గురు చరణ్ రాసిన పాటలు నిన్నటి తరం మూవీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అవి విషాదం గీతాలైనా, ఇతర పాటలైనా కూడా గురు చరణ్ కలం నుంచి జాలు వారిన పాటలు ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారన్న వార్త టాలీవుడ్లో విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ మూవీ లవర్స్ లిరిక్ రైటర్ గురు చరణ్ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు