Chad McQueen : కరాటే కిడ్ కన్నుమూత… కారణాన్ని బయట పెట్టని ఫ్యామిలీ

Chad McQueen : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. పాపులర్ హాలీవుడ్ మూవీ ది కరాటే కిడ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్, కార్ రేసింగ్ స్టార్ స్టీవ్ మెక్‌క్వీన్ కుమారుడు చాడ్ మెక్‌క్వీన్ తాజాగా మరణించారు. ఆయన వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. మెక్ క్వీన్ న్యాయవాది, స్నేహితుడు ఆర్థర్ హెచ్ బారెన్స్ బుధవారం ఆయన మరణించినట్లు ప్రెస్‌ కి తెలిపారు.

చాడ్ మెక్‌క్వీన్ ఎలా చనిపోయాడు ?

చాడ్ మెక్‌క్వీన్ భార్య జీనీ, అతని పిల్లలు చేజ్, మాడిసన్ గురువారం మధ్యాహ్నం మెక్ క్వీన్ మరణం గురించి సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్ కు తెలియజేశారు. “మాకు ప్రేమను పంచిన తండ్రిగా ఆయన అద్భుతమైన ప్రయాణం, మా తల్లి పట్ల ఆయన అచంచలమైన నిబద్ధతతో పాటు, ప్రేమ.. అంకితభావంతో నిండిన జీవితం నిజంగా మాలో స్పూర్తిని నింపింది. రేసింగ్ పట్ల ఆయన అభిరుచి తనలో ఉన్న అసాధారణమైన ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా, ఆయన తండ్రి వారసత్వాన్ని గౌరవించే మార్గంగా కూడా పని చేసింది. చాడ్ మెక్‌క్వీన్ అభిరుచి, జ్ఞానం, అంకితభావాన్ని మాకు అందించాడు. మేము అతని వారసత్వాన్ని కొనసాగిస్తాము” అంటూ ఆయన పిల్లలు ఆ పోస్ట్ లో వెల్లడించారు. అయితే చాడ్ మెక్‌క్వీన్ ను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబం సభ్యులు ఈ  విషయంలో ప్రైవసీని ఇవ్వాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే చాడ్ మెక్‌క్వీన్ మరణానికి గల కారణం ఏంటో ఆయన ఫ్యామిలీ గానీ, లాయర్ గానీ వెల్లడించలేదు.

Karate Kid' actor Chad McQueen (63) diesచాడ్ మెక్‌క్వీన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్

మెక్ క్వీన్ తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కార్ రేసింగ్ కూడా చేసేవారు. ఆయన 1984లో వచ్చిన ది కరాటే కిడ్‌లో డచ్ పాత్రలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. దాని సీక్వెల్‌ లో కూడా నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు చాడ్ మెక్‌క్వీన్ న్యూయార్క్ కాప్, స్క్వాండరర్స్, రెడ్ లైన్‌తో సహా పలు హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రాలలో నటించాడు. ఐ యామ్ స్టీవ్ మెక్‌క్వీన్, స్టీవ్ మెక్‌క్వీన్: ది మ్యాన్ & లే మాన్స్ అనే డాక్యుమెంటరీలను కూడా నిర్మించారు. ది వాంపైర్ డైరీస్‌ కూడా ఆయనకు సూపర్ పాపులారిటీని తెచ్చి పెట్టింది. చివరికి ఆయన నటన కంటే ఎక్కువగా రేసింగ్‌లో నిమగ్నమయ్యాడు. సినిమాలను పక్కన పెట్టి కస్టమ్ కార్లు, మోటార్ సైకిళ్ళు రూపొందించే మెక్‌క్వీన్ రేసింగ్ అనే సంస్థను స్థాపించాడు. ఆయన కుమారుడు చేజ్, అతని కుమార్తె మాడిసన్ ఇప్పుడు కంపెనీని నడుపుతున్నారు. పాపులర్ 24 అవర్స్ ఆఫ్ లే మాన్స్, 24 అవర్స్ ఆఫ్ డేటోనా రేసులలో పోటీ పడ్డాడు. ఆ తరువాత గాయాల వల్ల సినిమాలకు దూరం అయ్యారు. ఇక చాడ్ మెక్‌క్వీన్ కు సోదరి కూడా ఉండేది. ఆమె 1998లోనే 38 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చనిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు