Bigg Boss 8 Telugu : అయ్యో సోనియా లైఫ్ లో ఇన్ని కష్టాలా.. అతను చూపించిన నరకానికి..

Bigg Boss 8 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 తెలుగు ప్రసారం అవుతుంది. ఈ సీజన్ లో అందరి మాట ఏమో గానీ సోనియా ఆకుల ( Sonia Akula ) హైలెట్ అవుతూ వస్తుంది. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతూ వస్తుంది. అయితే ఈమె పాజిటీవ్ కన్నా ఎక్కువగా నెగిటివ్ గానే వినిపిస్తుంది. అయిందానికి కానీ దానికి రెస్పాండ్ అవుతుంది. హౌస్ లో తానొక్కటే అన్న విధంగా రచ్చ చేస్తుంది. మాటకు ముందు విష్ణు ప్రియపై పడి ఏడుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. మొదటివారం బేబక్క తను చూసినా, పక్కన నిలుచున్నా, నడుస్తున్నా ప్రాబ్లం అంటుంది అంటూ సోనియాపై మండిపడింది.. అయితే ఆమె హౌస్ లో నుంచి వెళ్ళిపోయాక ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది.

ఇక అసలు విషయానికొస్తే ఎప్పుడు కోపంగా ఉండే సోనియా కు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. ఏంటి నిజమా అని ఆశ్చర్య పోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ వరకు అందరి మీద అరుస్తూ కనిపించే ఈ అమ్మడుకు ఒక లవ్ స్టోరీ ఉందా అని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్ లో సోనియా తన లవర్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
.
నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన విషయాలను గమనిస్తే.. లో ఎమోషనల్ సర్ప్రైజ్ చేసి బిగ్ బాస్ అందరినీ ఏడిపించారు. ఆ తర్వాత సోనియా, నిఖిల్ ఒకే దగ్గర చేరి కాసేపు మాట్లాడుకున్నారు. ఆ టైంలో సోనియా బాగా ఎమోషనల్ అయింది. ముందుగా నిఖిల్ అంతా ఓకే కదా అని అడిగాడు. అయితే సోనియా అతని ప్రశ్నకు సమాధానంగా అవును.. కానీ ఇంకేం వస్తాయో తెలియట్లేదు అని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే నిఖిల్ నువ్వేంటో అతనికి కంప్లీట్ గా తెలుసు కదా అని అడిగాడు. దానికి ఒక్కసారిగా ఏడ్చేసింది సోనియా.. అయితే తన లవర్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. అంత ప్రేమ ఉన్న ఆమె ఎందుకు విడిపోయారు. అతను నరకం చూపించాడా మరేదైనా కారణం ఉందా అనేది తెలియలేదు..

Sonia opens up about her love story in the Bigg Boss house
Sonia opens up about her love story in the Bigg Boss house

ఇక హౌస్ సోనియా పృథ్వి, నిఖిల్ లతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందా అన్నట్టుగా కనిపిస్తోంది. సోనియా ఎక్కువగా వీళ్ళిద్దరితోనే కనిపిస్తుంది. అభయ్ కూడా మంచి బాండింగ్ ఉన్నప్పటి కీ వాళ్ళిద్దరి రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ లాగే కనిపిస్తోంది బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకులకి అలానే అనిపిస్తుంది.. ఈ ఎపిసోడ్స్ తన బాయ్ ఫ్రెండ్ చూస్తే ఇక షాక్ అవ్వడం పక్కా.. ఏది ఏమైనా ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో ఆసక్తిగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ భాషా ఎలిమినేటి వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఎవరు వెళ్తారో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు