Manchu Manoj: MBU లో ఇంత మోసమా.. నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్..!

Manchu Manoj.. సినిమా ఇండస్ట్రీలో మంచు మనోజ్ (Manchu Manoj) ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ న్యాయం కోసం పోరాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన తండ్రి స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) లో జరిగే మోసాలను విద్యార్థులు బయటపెట్టడంతో వారికి అండగా నిలుస్తూ..అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫీజుల పేరిట భారీ మోసం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ నటుడిగా, కలెక్షన్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్న మోహన్ బాబు (Mohan Babu) లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేశారు. సినిమాల ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మోహన్ బాబు కు తాజాగా నెగిటివ్ ఇమేజ్ మూటకడుతున్నారని చెప్పవచ్చు. ఈయన సినిమాలు కలెక్షన్లతో పాజిటివ్ టాక్ తెస్తుంటే , మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల కలెక్షన్లు ఆయనకు నెగిటివ్ ఇమేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు, ఇతర చార్జీలు ఒక రేంజ్ లో ఉన్నాయి అంటూ విద్యార్థి సంఘాలతో పాటు పేరెంట్స్ అసోసియేషన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మండిపడుతున్న పేరెంట్స్ అసోసియేషన్..

ఈ మేరకు ఏఐసిటి కి పేరెంట్స్ అసోసియేషన్ కూడా లేఖ రాసింది. ఆ లేఖలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ఐటీ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేయిస్తున్నారట. అంతేకాదు డే స్కాలర్స్ కి కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్ లోనే తినాలనే కండిషన్ కూడా పెట్టడంతో ఆందోళనలు పెరిగిపోయాయి.

- Advertisement -

విద్యార్థి సంఘాలకు అండగా మంచు మనోజ్..

ఈ విషయంపై మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నాన్నగారు మంచి మనిషి అని చెబుతూనే, విద్యార్థుల ఆందోళనలకు ఫుల్ సపోర్టు కూడా ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనలు తనను మరింత బాధపెట్టాయని తెలిపారు. ముఖ్యంగా ఈ విషయాన్ని యూనివర్సిటీ ఛాన్స్లర్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంచు మనోజ్ . తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఏఐఎస్ఎఫ్ కి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన మనోజ్, ఈ అంశంపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ ను వివరణ కోరినట్లు కూడా తెలిపారు.

Manchu Manoj: Is MBU so fraudulent.. Manchu Manoj revealed the truth..!
Manchu Manoj: Is MBU so fraudulent.. Manchu Manoj revealed the truth..!

కుటుంబంతో గొడవలపై క్లారిటీ..

ఇకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ , శ్రీ విద్యానికేతన్ సంస్థలు మోహన్ బాబు పెద్ద తనయుడు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు రాయలసీమ వాసులు విద్యార్థుల ప్రయోజనాలకే మోహన్ బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన మంచి మనోజ్ , తన అన్న నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖండించే ప్రయత్నం చేయకుండా విమర్శించేలా పోస్ట్లు పెడుతున్నారు . ఇక రివర్స్లో అక్కడ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు ఇస్తున్నారు అంటే ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై మంచు విష్ణు, మనోజ్ మధ్య ఏదైనా గొడవ జరుగుతుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు