Netflix : స్క్విడ్ గేమ్ పై కాపీ ఆరోపణలు… బాలీవుడ్ డైరెక్టర్ కు ఇచ్చి పడేసిన నెట్ ఫ్లిక్స్

Netflix : పాపులర్ కొరియన్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game)ను లక్ అనే తన హిందీ చిత్రం (Luck) నుంచి కాపీ చేశారంటూ బాలీవుడ్ డైరెక్టర్ సోహమ్ షా చేసిన ఆరోపణలను నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఖండించింది. తన సినిమా నుండి సిరీస్ కాన్సెప్ట్ ను తీసుకున్నారని ఆరోపిస్తూ సదరు దర్శకుడు స్ట్రీమింగ్ దిగ్గజంతో పాటు స్క్విడ్ గేమ్‌ల (Squid Game)  సృష్టికర్తలపై శనివారం దావా వేశారు.

డైరెక్టర్ కు నెట్ ఫ్లిక్స్ (Netflix) సమాధానం

నెట్‌ఫ్లిక్స్ సోహమ్ చేసిన ఆరోపణను ఖండించింది. ఆయన వేసిన దావాకు ప్రతిస్పందనగా “స్క్విడ్ గేమ్ (Squid Game) ను స్వయంగా హ్వాంగ్ డాంగ్-హ్యూక్ సృష్టించారు, రాశారు. మేము ఈ విషయాన్ని సమర్థించాలనుకుంటున్నాము” అని చెప్పుకొచ్చింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ షా ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదని, ఈ సిరీస్ పూర్తిగా హ్వాంగ్ టాలెంట్ మాత్రమేనని చెప్పింది. 2009లో తాను స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించానని హ్వాంగ్ గతంలో పేర్కొన్నాడు. అయితే నెట్‌ఫ్లిక్స్ రెండు సినిమాల మధ్య ఏదైనా సారూప్యత ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికమని, స్క్విడ్ గేమ్ (Squid Game) హ్వాంగ్ స్వంత ఊహ నుండి ఒక ప్రత్యేకమైన సృష్టి అని పేర్కొంది.

Squid Game COPIED From Hindi Film Luck? Soham Shah Files Case Against Netflix And Creators For 'Blatant Rip-Off' | Times Now

- Advertisement -

సోహమ్ వాదన ఏంటంటే?

తన చిత్రం ‘లక్’ జాక్‌పాట్ గెలవాలనే ఆశతో ప్రాణాంతకమైన గేమ్‌లు ఆడుతున్న వ్యక్తుల సమూహం చుట్టూ తిరుగుతుందని షా పిటిషన్ లో పేర్కొన్నట్లు వెల్లడైంది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, ఇమ్రాన్ ఖాన్, శృతి హాసన్ ఈ చిత్రంలో నటించారు. ఇది భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యూఏఈ లతో సహ 2009లో జూలైలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రతి ఆటగాడి మరణంతో, ప్రైజ్ పూల్ పెరుగుతుంది. ఇదే విధంగా ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ప్లాట్‌ కుద ఉందని షా చెప్పారు. దావాలో స్క్విడ్ గేమ్ (Squid Game) సృష్టికర్త హ్వాంగ్ డాంగ్-హ్యూక్ 2009లో తన సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌పై పని చేయడం ప్రారంభించినట్లు బహిరంగంగా వెల్లడించాడని షా ఎత్తి చూపారు. హ్వాంగ్ తాను సినిమాను విడుదల చేసిన సమయంలోనే స్క్విడ్ గేమ్ స్క్రిప్ట్ ను రాసుకున్నాను అని చెప్పడమే తన మూవీ నుంచి కాపీ కొట్టారు అనడానికి నిదర్శనం అని షా అన్నారు. ఈ కొరియన్ సిరీస్ తన చిత్రం లక్ నుంచి ప్రేరణ పొందిందని ఆయన వాదించాడు. కాగా స్క్విడ్ గేమ్ (Squid Game) సీజన్ 2 డిసెంబర్ 26న ప్రీమియర్ అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)పై ఇతర పిటిషన్లు

నెట్‌ఫ్లిక్స్ (Netflix) పై ఎమ్మీ-నామినేట్ షో ‘బేబీ రైన్‌డీర్’పై దాఖలు చేసిన మరో $170 మిలియన్ల దావా కూడా ఉంది. షో స్టాకర్ మార్తా స్కాట్ దాని సృష్టికర్త, రచయిత, స్టార్ రిచర్డ్ గాడ్‌తో ఆమె చర్యల ఆధారంగా ఫియోనా హార్వే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సమాచారం ప్రకారం, ఫెడరల్ న్యాయమూర్తి ఈ కేసు ట్రయల్ తేదీని 2025 మే 6న నిర్ణయించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు