Lal Salaam: 8నెలల తర్వాత ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓటీటీ లో స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Lal Salaam: సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ (Rajinikanth ) వయసు మీద పడిన సరే వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జైలర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలాం సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ కీలక పాత్రలు పోషించగా రజనీకాంత్ గెస్ట్ పాత్ర పోషించారు.

ఓటీటీ కి సిద్ధమైన లాల్ సలాం..

ఇకపోతే ఈ సినిమా ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే విడుదలైన 8 వారాలకి ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ లాల్ సలాం సినిమా విడుదలయి 8 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఓటీటీ లోకి రాలేదు అయితే ఇప్పుడు తాజాగా అభిమానులకు శుభవార్త చెబుతూ లాల్ సలాం సినిమా ఓటిటి స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చారు ఈ చిత్ర దర్శకురాలు ఐశ్వర్య. తాజాగా ఇదే విషయంపై లాల్ సలాం సినిమాకి దర్శకత్వం వహించిన ఐశ్వర్య స్పందిస్తూ.. ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇచ్చింది.

ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ..

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ.. లాల్ సలాం సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి మేము చాలా కష్టపడ్డాము. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఊహించని విధంగా థియేటర్లో మేము విడుదల చేయలేకపోయాం. ఇందులోని ముఖ్యమైన సన్నివేశాలు మిస్ కావడం వల్ల మా ఈ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇటీవల మాకు హార్డ్ డిస్క్ దొరికింది. ఆ మిస్ అయిన సన్నివేశాలను మళ్లీ మేము యాడ్ చేస్తాము. థియేటర్ వెర్షన్ కాకుండా డైరెక్టర్ కట్ వెర్షన్ తో మా సినిమా ఓటీటీ లోకి వస్తుంది. ఇందుకోసం రెహమాన్ కూడా పనిచేస్తున్నారు. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా కోసం పనిచేయడం నిజంగా సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రజినీకాంత్.

- Advertisement -
Lal Salaam: News that kicks fans after 8 months.. Ready for streaming in OTT..!
Lal Salaam: News that kicks fans after 8 months.. Ready for streaming in OTT..!

రజనీకాంత్ ఫ్యాన్స్ ఖుషీ..

ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లాల్ సలాం ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూడా. మొత్తానికి అయితే థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించ లేకపోయిన ఈ సినిమా ఇటు ఓటీటీ లో అయినా సరే ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమా ఇలా పరవాలేదు అనిపించుకున్నప్పుడు చాలా వరకు తమ తప్పులేదు అని రజనీకాంత్ పాత్రను మార్చడం వల్లే సినిమా డిజాస్టర్ అయిందని చిత్ర బృందం అప్పట్లో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుంది ఏ ప్లాట్ఫారం ద్వారా విడుదలవుతుంది అనే విషయాలు త్వరలో తెలియని ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు