రామ్ గోపాల్ వర్మ..
హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, సినిమాలు అని తేడా లేకుండా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటాడు. ఈ మధ్య కాలంలో మథర్స్ డే సందర్భంగా ఆర్జీవీ తనదైన శైలీలో ట్వీట్ చేసి హెడ్ లైన్స్ లో నిలిచాడు. తాజా గా వర్మ పెద్ద సినిమాలు, హీరోలు, డైరెక్టర్ల ను టార్గెట్ చేశాడు. వరుస ట్వీట్లతో వారిపై సెటైర్లు వేసి మరో సారి అందరి నోట నానుతున్నాడు.
కేజీఎఫ్ చాప్టర్ – 2 ను ఆర్జీవీ ప్రస్తావిస్తూ,
“కేజీఎఫ్ ఒక మహా వృక్షం లాంటింది. ఈ చెట్టు కింద మళ్లీ ఏ చెట్టు కూడా పెరగదు”
“ కేజీఎఫ్ ఒక పెద్ద కారు మబ్బు లాంటింది. పెద్ద సినిమాలన్నింటినీ, ఈ మేఘం కమ్మేస్తుంది.
ఈ మూవీ కలెక్షన్ల వర్షం స్టార్ హీరోలు, డైరెక్టర్లందరినీ ముంచేస్తుంది.
కేజీఎఫ్ ఓ పెద్ద ఇసుక ఊబి వంటింది. పాత పద్దతిలో సినిమాలు చేసే డైరెక్టర్లను మింగేస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు.
ఈ వరుస ట్వీట్లతో అన్నీ ఇండస్ట్రీల్లోని హీరోలు, డైరెక్టర్లపై సెటైర్లు వేశాడు వర్మ . అయితే ఇటీవల టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి ఆచార్య తో పాటు నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అయ్యాయి. ఆచార్య నెగెటివ్ టాక్ తెచ్చుకోగా, సర్కారు వారి పాట నుండి మిశ్రమ స్పందన వస్తుంది.
ఈ తరుణంలో వివాదలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ, ఎవరిని ఉద్ధేశించి ఈ ట్వీట్లు చేశాడో అని నెటిజన్లు కామెట్లు చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ – 2 బాగానే ఉన్నా, ఇన్ని రోజుల తర్వాత అనవసరంగా వర్మ హైప్ క్రియేట్ చేస్తున్నాడని మరి కొంత మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు.
I think #KGF2 is like an enoromous tree under whose shadow , no tree seems to be growing
— Ram Gopal Varma (@RGVzoomin) May 12, 2022
.#KGF2 is like a large dark cloud casting a doomsday shadow on all the other big films and the black clouds torrential collections are draining all other stars and star directors
— Ram Gopal Varma (@RGVzoomin) May 12, 2022
. #KGF2 is like a quick sand just swallowing up all old fashioned biggies
— Ram Gopal Varma (@RGVzoomin) May 12, 2022