Sukumar: మాస్ యాంగిల్ కు అద్దం పట్టేలా ఆ మూడు పాత్రలు 

డైరెక్టర్ సుకుమార్ పేరు వినగానే క్లాస్ అండ్ ఇంటలెక్చువల్ లక్షణాలున్న హీరోలు మన కళ్ల ముందు మెదులుతారు. అయితే ఇది ఒకప్పటి మాట, రంగస్థలం, పుష్ప సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చూస్తే సుకుమార్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా పక్కా మాస్ పల్లెటూరి యువకులు దర్శనమిస్తారు. తాజాగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన సినిమా దసరా లో ధరణి పాత్ర కూడా చిట్టిబాబు, పుష్పరాజ్ పాత్రలను పోలి ఉండటం గమనార్హం. పైకి చూడటానికి మాస్ పాత్రలుగా కనిపించినప్పటికీ సందర్భాన్ని బట్టి తమ తెలివిని ప్రదర్శించేలా డిజైన్ చేసాడు సుకుమార్ ఆ పాత్రలను.

ఉదాహరణకు రంగస్థలంలో షేకింగ్ శేషు సూసైడ్ చేసుకునే సీన్ కానీ, సమంతకు తన లోపం తెలియకుండా మోటర్ ఆన్ చేసే సీన్లో కానీ చిట్టి బాబు పాత్ర వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. పుష్ప సినిమాలో కూడా ఎర్రచందనం దుంగలు పోలీస్ లకు దొరకకుండా తప్పించే సీన్, క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్ ను ఎదుర్కునే సీన్లో కానీ సుకుమార్ మార్క్ హీరోయిజం గమనించొచ్చు.పైగా ఈ రెండు పాత్రలకు లోపం కామన్ గా ఉన్నట్టే ఇద్దరి మెళ్ళో ఆంజనేయ స్వామి లాకెట్ ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్లను చూస్తే ఒక క్లాస్ డైరెక్టర్ మాస్ పాత్రలు డిజైన్ చేస్తే ఇంత అరాచకంగా ఉంటుందా అన్న ఫీలింగ్ రాక మానదు.

ఇక దసరా విషయానికి వస్తే, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ధరణి పాత్ర విషయంలో గురువుని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఇందులో కూడా నాని మాస్ లుక్ లో కనిపిస్తూనే అక్కడక్కడా కొన్ని సీన్లలో సుకుమార్ మార్క్ హీరోయిజాన్ని గుర్తు చేస్తాడు. ఇక్కడ శ్రీకాంత్ ఓదెలను తక్కువ చేయటం ఉద్దేశం కాకపోయినప్పటికీ రంగస్థలం, పుష్ప సినిమాల ప్రభావం దసరా సినిమాలో కూడా కనిపిస్తుంది. ఆ రెండు సినిమాల్లో లాగే ఇందులో కూడా హీరో ,మెళ్ళో కూడా ఆంజనేయ స్వామి లాకెట్ ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన సుకుమార్ తాలూకా మాస్ ఫార్ములా శ్రీకాంత్ కు కూడా బాగానే వర్కౌట్ అయ్యిందని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు