Akhil: అక్కినేని హీరో కోసం సమంత ట్వీట్..!

అక్కినేని నాగచైతన్య తో సమంత విడిపోయి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది. విడాకుల తర్వాత కూడా సమంత అక్కినేని అఖిల్ తో టచ్ లో ఉంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే.. ఇండస్ట్రీలో ఏ ప్రముఖ సెలబ్రిటీ పుట్టినరోజు వచ్చిన సమంత విష్ చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఏప్రిల్ 8వ తేదీన అక్కినేని అఖిల్ పుట్టినరోజు కావడంతో సెలబ్రిటీలంతా అతనికి విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే సమంత కూడా సోషల్ మీడియా ద్వారా అఖిల్ కి విషెస్ తెలిపింది.

అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా పోస్టర్ ని సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ.. ” హ్యాపీ బర్త్ డే అఖిల్.. ఎంతో ప్రేమతో ఏజెంట్ కోసం ఎదురుచూస్తున్నా” అని పేర్కొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మాజీ భర్త నాగచైతన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి సమయం ఉండదు కానీ.. అఖిల్ కి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కనీసం నాగార్జున పుట్టినరోజుకి కూడా విష్ చేయలేదు. అఖిల్ కి మాత్రమే ఎందుకు స్పెషల్ గా విష్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ అనేక విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది నేటిజన్స్ మాత్రం సమంత, అఖిల్ కి విషెస్ చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు