Akhil: రిలీజ్ దగ్గర పడుతున్నా సందడి లేని ఏజెంట్..!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యింది సినిమా యూనిట్. ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ మరియు కొంత టాకీ పార్ట్ షూటింగ్ పెండింగ్ ఉందన్న టాక్ వస్తున్నప్పటికీ ఈ సారి అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్ చేయాలని యూనిట్ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగట్లేదని అంటున్నారు. సినిమా అనౌన్స్ చేయగానే భారీ రేట్లు ఆఫర్ చేసిన బయ్యర్స్ కూడా ఇప్పుడు మినిమమ్ రేటు పెట్టడానికి వెనకాడుతున్నారట.

ఏజెంట్ సినిమా బిజినెస్ డల్ గా ఉండటానికి కారణం రిలీజ్ పలుమార్లు వాయిదా పడటం ఒకటైతే, టీజర్ ద్వారా క్రియేట్ అయిన హైప్ ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్ క్యారీ చేయలేకపోవటం మరో కారణం. టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచితే విడుదలైన పాటలు ఒక్కటి కూడా మెప్పించలేక పోయాయి. నైజాం ఏరియాలో కాస్తో కూస్తో బిజినెస్ ఉండగా, ఆంధ్రా సీడెడ్ ఏరియాల్లో మాత్రం 15కోట్ల బిజినెస్ జరగటం కూడా కష్టంగా ఉందట.

ఈ సినిమా ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా, మేకర్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక బిజినెస్ పుంజుకుంటుందని ఆశగా ఉన్నారట. సినిమా రిలీజ్ కి రెండు వారాల సమయం కూడా లేకపోవటం, సినిమా ప్రమోషన్స్ పై యూనిట్ ఇంకా దృష్టి పెట్టకపోవడం చూస్తుంటే, ఈ సారి కూడా  రిలీజ్ వాయిదా పడుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. కెరీర్ ఆరంభం నుండి బ్లాక్ బస్టర్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న అఖిల్ ఆశించిన హిట్ ఇంకా రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా ఓకే అనిపించినప్పటికీ అక్కినేని అభిమానులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అఖిల్ కెరీర్ కి హిట్ తప్పనిసరి అయిన పరిస్తుతుల్లో వస్తున్న ఏజెంట్ సినిమాపై ఉన్న అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు