Tollywood: ఆ సుఖం కోసమే..హీరోయిన్లు – ప్రగతి సంచలనం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. సినిమాల్లో అత్త, తల్లి లాంటి పాత్రలు చేస్తూ ప్రగతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం ఎమోషనల్ సన్నివేశాలలో నటించడమే కాకుండా కామెడీ పండించడంలో కూడా ప్రగతికి మంచి గుర్తింపు ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రగతికి ఎంతో ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.

వర్కౌట్ చేస్తున్న వీడియోలు మరియు రీల్స్ వీడియోలతో ప్రగతి నెట్టింట హల్చల్ చేస్తుంటారు. ఏజ్ పెరిగిన హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా వర్కౌట్ చేస్తూ ప్రగతి కుర్రాళ్ల మతి పోగోడుతుంటారు. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా పరిశ్రమ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని చెప్పింది. సక్సెస్ సాధించిన ఏ హీరోయిన్ కూడా తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని చెబుతుందని తెలిపింది.

హీరోయిన్లపై కోట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం… వాళ్లకి కావాల్సినంత పారితోషం ఇవ్వడం… కేవలం ఐదు నిమిషాల సుఖం కోసం కాదు అంటూ లాజిక్ మాట్లాడింది. ఫలానా అమ్మాయి అందుకు ఒప్పుకుంటే ఛాన్స్ ఇస్తా అంటే కుదరదు అని చెప్పింది. ఆ అమ్మాయికి ఆరోజు సెట్ కావడం అనేది అక్కడ చాలా ముఖ్యమని చెప్పింది. హీరోయిన్ల కెరీర్ ను క్యాస్టింగ్ కౌచ్ ప్రభావితం చేస్తుందంటే తాను నమ్మనని ప్రగతి తెలిపింది. సక్సెస్ లేక ఫ్లాప్ అయిన హీరోయిన్లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తారని స్పష్టం చేసింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు