Citadel: బోల్డ్ సీన్స్ పై స్పందించిన ప్రియాంక..!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కు సంబంధించిన ప్రీమియర్స్ ఇటీవలే మొదలయ్యాయి. దర్శక ద్వయం రాజ్, డీకే లు దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ గురించి ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 28నుండి స్ట్రీమ్ అవనున్న సిరీస్ ప్రియాంక నటించిన బోల్డ్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రీమియర్స్ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బోల్డ్ సీన్స్ పై స్పందించిన ప్రియాంక చోప్రా కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు.
బోల్డ్ సీన్స్ లో నటించే సమయం రిచర్డ్, ప్రియాంక పరస్పరం సపోర్ట్ చేసుకున్నామని, కొన్ని కొన్ని సార్లు తమ ప్రైవైట్ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డంగా పెట్టుకొని జాగ్రత్త పడ్డామని చెప్పుకొచ్చింది. కొన్ని అసాధారణమైన యాంగిల్స్ లో నటించాల్సి వచ్చినప్పుడు ఇద్దరం ఇబ్బంది పడ్డామని చెప్పింది. రిచర్డ్ చాల సందర్భాల్లో ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా ఎలా కవర్ చేయాలో సలహాలు ఇచ్చాడని, ఇద్దరం పరస్పరం సపోర్ట్ చేఉకోవటం వల్ల ఇంటిమేట్ సీన్స్ చేయటానికి పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పింది ప్రియాంక.
సమంత ఈ సిరీస్ ఇండియన్ వర్షన్లో నటించనుండటంతో బోల్డ్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. సమంత కూడా ప్రియాంక రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేస్తుందా లేక ఆ సీన్స్ లో బోల్డ్ నెస్ తగ్గిస్తారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే గతంలో సమంత రాజ్ డీకేలు చేసిన ఫ్యామిలీ మ్యాన్2లో మరీ ప్రియాంక రేంజ్ లో బోల్డ్ సీన్స్ లేనప్పటికీ ఒక సీన్ లో కొంత మేర బోల్డ్ నెస్ ఉండటంతో సోషల్ మీడియాలో ప్రత్యేకించి నాగచైతన్య ఫ్యాన్స్ నుండి ట్రోలింగ్ కి గురైంది. రిలీజ్ కి ముందే ప్రకంపనలు రేపుతున్న సిటాడెల్ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు