Siddharth: మొదటి భార్య ఎవరో తెలుసా..? విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..?

సినీ ఇండస్ట్రీలో కొంతమంది యంగ్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ గా మారి ఆ తర్వాత ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్ వంటి హీరోల పేర్లు ఉంటాయి. ఉదయ్ కిరణ్, తరుణ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. నిజానికి తమిళనటుడే అయినప్పటికీ.. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సహజమైపోయింది. ఇలా విడిపోయిన వారిలో సిద్ధార్థ్, మేఘన కూడా ఉంటారు.

2003లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, మేఘన.. నాలుగు సంవత్సరాల పాటు కలిసుండి ఆ తర్వాత 2007లో విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ్ ప్రవర్తన వల్లే విడాకులు తీసుకున్నారట. అయితే మేఘన గురించి అత్యంత సన్నిహితులకు తప్ప బయట వారికి అంతగా తెలియదు. వీరు విడాకులు తీసుకునే సమయానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని టాక్. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఇక మేఘనతో విడిపోయిన తర్వాత తనతో నటించిన పలువురు హీరోయిన్లతో సిద్ధార్థ ప్రేమాయణాన్ని నడిపించాడు. ఇక ప్రస్తుతం యంగ్ హీరోయిన్ అధితి రావు హైదరితో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నాడు. అంతేకాదు త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా సమాచారం.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు