Virupaksha: సుకుమార్ పేరు నిలబెడుతున్న శిష్యులు..! 

టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది. సుకుమార్ శిష్యులు వరుస హిట్స్ తో తమ సత్తా చాటుతున్నారు. ఉప్పెనతో బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు, ఇటీవల దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల పాన్ ఇండియా వైడ్ తన పేరు మారుమోగేలా చేసాడు. తాజాగా విరుపాక్షతో కార్తీక్ దండు కూడా హిట్ అందుకున్న సుకుమార్ శిష్యుల లిస్ట్ లో చేరాడు. పాజిటివ్ బజ్ తో ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన విరూపాక్ష డీసెంట్ టాక్ అందుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టే దిశగా పయనిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ బాగా డీల్ చేసాడు అన్న టాక్ వస్తోంది.

తన శిష్యులు వరుసగా హిట్స్ అందుకుంటూ ఉండటంతో లెక్కల మాస్టారు సుకుమార్ ని అందరూ అభినందిస్తున్నారు. అయితే, సుకుమార్ శిష్యుల్లో ఒక్కరు కూడా అతని స్టైల్ ని కపి కొట్టకుండా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తుండటం విశేషం. ఈ క్రమంలో సుకుమార్ శిష్యులు తొలి సినిమాతోనే హిట్ అందుకోవాటానికి కారణం సుకుమార్ ట్రైనింగ్ మహత్యమా లేక అది వాళ్లలోని ట్యాలెంటా అన్న చర్చ జరుగుతోంది.

విరూపాక్ష సినిమాకు రిలీజ్ కి ముందు నుండే దర్శకుడు కార్తీక్ దండు లోని ప్రతిభ గురించి పలుమార్లు చెప్పుకొచ్చాడు సుకుమార్. సుకుమార్ మాటల్ని నిజం చేస్తూ విరూపాక్ష హిట్ టాక్ సొంతం చేసుకోవటం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టి గురువు పేరు నిలబెట్టిన సుకుమార్ శిష్యులు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు