Tollywood: ట్యాలెంట్ ఉన్నా హిట్ దక్కని డైరెక్టర్..!

సాధారణంగా కొంతమంది టాలెంట్ ఉన్నప్పటికీ ఎంత కష్టపడ్డా కూడా విజయం అందని ద్రాక్ష లాగే ఊరిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు అన్ని రంగాల్లో తారస పడుతూ ఉంటారు ముఖ్యంగా సినీ రంగంలో ఎక్కువ మంది ఇలాంటి వారు కనిపిస్తూ ఉంటారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అలాంటి వారిలో ఒకడని చెప్పచ్చు. ‘ఐతే’ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడి పరిచయమైన చంద్రశేఖర్ యేలేటి మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకొని నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన తీసిన సినిమాలన్నీ విభిన్న కథాంశాలతో కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ దర్శకుడిగా యేలేటికి బ్రేక్ మాత్రం ఇవ్వలేకపోయాయి.

కెరీర్ ఆరంభించి సుమారు 20ఏళ్ళు దాటుతున్నా కూడా ఈయన తీసింది 8సినిమాలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది చంద్రశేఖర్ యేలేటి స్టైల్ అఫ్ మేకింగ్. కమర్షియల్ స్టోరీస్ జోలికి వెళ్లకుండా విభిన్న కథాంశంతో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. హాలీవుడ్ సినిమాల నుండి మనవాళ్లు స్ఫూర్తి పొందటం సహజం, కానీ చంద్రశేఖర్ యేలేటి తీసిన ఒక్కడున్నాడు సినిమా ఆధారంగా ఓ హాలీవుడ్ సినిమా రూపొందింది అంటే ఈయన ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారో అన్నదానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమా మినహా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. గుణ్ణం గంగరాజు దగ్గర లిటిల్ సోల్జర్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తర్వాత ఆయన బ్యానర్లో వచ్చిన ఐతే సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రశేఖర్ యేలేటి. ఆ తర్వాత గుణ్ణం గంగరాజు డైరెక్షన్లో వచ్చిన అమృతం సీరియల్ మొదటి పది ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాడు చంద్రశేఖర్ యేలేటి. ఇలాంటి అరుదైన దర్శకుడికి త్వరలోనే ఆశించిన హిట్ దక్కి, ఈయన నుండి మరిన్ని విభిన్న కథాంశం ఉన్న సినిమాలు రావాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు