Akhil : ఏజెంట్ సినిమా రీ రిలీజ్ ? అసలు విషయం ఏంటంటే..

అఖిల్ అక్కినేని హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ఏజెంట్. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ తన కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్మి తీసిన ఈ సినిమా అఖిల్ కి తీవ్ర నిరాశని మిగిల్చింది.

ఏజెంట్ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిలో అంచనాలను పెంచేసింది. అలాగే అఖిల్ కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉండటంతో అంత ఈసారి అఖిల్ కి హిట్ ఖాయమేనని అనుకున్నారు. పైగా సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా బాహుబలి,పోకిరి లాంటి సినిమాలు రిలీజై, ఇండస్ట్రీ హిట్ కొట్టిన తేదీన సినిమాని రిలీజ్ చేసారు. కానీ సినిమాలో కంటెంట్ లేకుండా ఎన్ని జిమ్మిక్కులు చేస్తే మాత్రం ఎం లాభం. సినిమా రిలీజైన మొదటి నుంచే నెగిటివ్ టాక్ రావడంతో మూవీ కనీస వసూళ్ళని కూడా రాబట్టలేకపోయింది. ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్, మలయాళం స్టార్ యాక్టర్ మమ్ముట్టి ఎవరు కూడా సినిమాని కాపాడలేకపోయారు. దాంతో ప్రేక్షకులు మరియు అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురయ్యారు

ఫ్యాన్స్ ఎమోషన్స్ ని అర్థం చేసుకున్న ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఏజెంట్ సినిమా ఫెయిల్యూర్ కి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేయడమే కారణమని ఆయన ట్విట్టర్ ద్వారా ఆ మధ్య స్పందించి అందరికి క్షమాపణలు తెలియజేసాడు.

- Advertisement -

ఆ తరువాత ఏజెంట్ సినిమా థియేటర్ రన్ పూర్తిగా కంప్లిట్ అవ్వకముందే ఓటిటి లోకి వచ్చేస్తోందటూ అప్డేట్ రావడంతో, ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం దానికి థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేసారు అని అందరు అంటుండటంతో, మేకర్స్ ఏజెంట్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు.

ఏజెంట్ సినిమా థియేటర్ లో ఆడుతున్న సమయంలో బాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మరియు కొన్ని చోట్ల సినిమా స్లో ఉండిందని కామెంట్స్ రావడంతో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఏజెంట్ టీం సినిమాలో మళ్ళీ కొన్ని చేంజెస్ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ చేంజెస్ చేసిన వెర్షన్ ని ఓటిటిలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ లో ఏజెంట్ చేంజెడ్ వెర్షన్ తో త్వరలో స్ట్రీమింగ్ కి రెడీ అవబోతుంది. ఏజెంట్ థియేటర్ రిలీజ్ వెర్షన్ కి ఓటిటిలో రిలీజ్ అవ్వబోతున్న వెర్షన్ కి చాలా తేడా ఉండబోతుందట ఒక రకంగా చెప్పాలంటే రీ- రిలీజ్ చేస్తున్నట్టే అని టాక్ . తొందరలోనే ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ రానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు