Dead Pixels: ఆ యంగ్ హీరో తో నిహారిక రొమాన్స్ ?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు కూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిహారిక… ఇప్పటికే పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. అయితే 2020లో ఆమె వివాహం అయిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది నిహారిక. కొన్ని డ్యాన్స్ షో, కామెడీ షోలలో కనిపించిన నిహారిక… సినిమాలు మాత్రం చేయలేదు. డిసెంబర్ 9 2020 సంవత్సరంలో… చైతన్య ను వివాహం చేసుకుంది నాగబాబు కూతురు నిహారిక. దాదాపు మూడేళ్లు వీరిద్దరూ మంచి లైఫ్ ఎంజాయ్ చేశారు.

అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నిహారిక ఫోటోలు చైతన్య డిలీట్ చేయగా… చైతన్య ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో.. నిహారిక ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లోని ఓ ప్రముఖ యంగ్ హీరోతో సినిమా చేయాలని నిర్ణయం తీసుకుందట. ఆ హీరో సరసన హీరోయిన్ గా రియంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట నిహారిక. అలాగే ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్ లలో నటించేందుకు కూడా నిహారిక నిర్ణయం తీసుకుందట. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉందని తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు