Mega Family: పాపం మెగా డాటర్‌… నిహారికకు మరీ ఇన్ని కష్టాలా?

ఈ మధ్య ఎక్కువ వార్తల్లో కనిపిస్తున్న వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తే నిహారిక ముందు వరుసలో ఉంటుంది. తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటుంది అంటూ ఇటీవల తెగ వార్తలు వచ్చిన సంగతి విధితమే. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో కావడం, నిహారిక మళ్లీ సినిమాల్లో కనిపించడం, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎగేంజ్మెంట్ వేడుకలో చైతన్య కనిపించకపోవడం వంటివి చూస్తే, నిహారిక తన భర్తతో విడిగా ఉంటుందని స్పష్టం అవుతుంది.

అయితే దీనికి కారణం, నిహారిక ను సినిమాలు చేయొద్దని చైతన్య కండీషన్స్ పెట్టాడాని, దీనికి నిహారిక ఒప్పుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం నిహారిక సినిమాలపై ఫోకస్ పెట్టింది. అందుకే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తుంది. ఈ ఫోటో షూట్స్ తో అయినా అవకాశాలు వస్తయని అనుకుంది ఈ మెగా డాటర్. అయితే, నిహారిక అనుకున్నట్టు ఏం జరగడం లేదు. ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

అంతలా అందాలను ఆరబోస్తే, అదా చిన్న చిన్న సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయే తప్పా.. చెప్పుకునే సినిమాల అవకాశాలు రావడం లేదు. టైర్ 2 కాకపోయినా, టైర్ 3 హీరోలతో అయినా, ఛాన్స్ వస్తే బాగుండు అనే ఆలోచనలో మెగా డాటర్ నిహారిక ఉందట. కానీ, టైర్ 3 కాదు కదా, కొంచెం పేరున్న హీరోల సినిమాల్లో కూడా నిహారికకు అవకాశం దక్కడం లేదు. మోస్తారు పేరున్న హీరోతో ఛాన్స్ వస్తే, తనేంటో చూపిస్తానని నిహారిక ప్రయత్నిస్తుంది. కానీ, ఎంత ప్రయత్నించినా, అలాంటి అవకాశాలు రావడం లేదు. దేని కోసమైతే, భర్తతో దూరంగా ఉంటుందో అదే జరగడం లేదంటూ మెగా డాటర్ తీవ్ర అసంతృప్తిలో ఉందట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు