నిఖిల్ సిద్ధార్థ, కెరీర్ ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం తన స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిఖిల్ మాస్ ఇమేజ్‌ని పొందాలని ప్రయత్నించినప్పటికీ అది జరగలేదు.
నిఖిల్ ప్రస్తుతం ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. నిఖిల్ కెరీర్లో మంచి హిట్ అయిన సినిమా కార్తికేయ,
ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ కార్తికేయ – 2, విడుదలకు సిద్ధమవుతోంది.
కార్తికేయ 1లోని మిస్టరీ ఎలిమెంట్‌ని తీసుకుని సీక్వెల్‌ని రూపొందిస్తున్నాడు చందూ మొండేటి. సినిమా విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో కార్తికేయ-2 ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీం.
“శాంతను” ఇది నువ్వు ఆపలేని యాగం; నేను సమిధని మాత్రమే ; ఆజ్యం మళ్ళీ అక్కడ మొదలయ్యింది; ప్రాణత్యాగం చేసే తేగింపు ఉంటేనే దానిని పొందగలం.” అనే మిస్టీరియస్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. MM కీరవాణి తనయుడు కాలభైరవ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెల 22న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.