Mega family: నిహారిక గురించి చైతన్యకు వరుణ్ తేజ్ ముందే చెప్పారా..?

మెగా ఫ్యామిలీలో ఓవైపు సంబరాలు, మరోవైపు విడాకుల పరంపర కొనసాగుతోంది. 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కావడం, మరోపక్క వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థ వేడుకలతో సంతోషాలు వెల్లివిరిశాయి అనుకునేలోపే.. నిహారిక విడాకుల వార్త పిడుగులా వచ్చి పడింది. గత కొద్ది రోజులుగా నిహారిక విడాకులపై జరుగుతున్న వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయి.

నిహారిక – చైతన్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేయడం, అవి మంజూరు కావడంతో మెగా ఫాన్స్ నిరాశ చెందారు. తన ఇంస్టాగ్రామ్ ద్వారా విడాకులను కన్ఫామ్ చేసింది నిహారిక. అంతేకాదు తమను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని రిక్వెస్ట్ చేసింది. చిరంజీవి చిన్న కూతురు విడాకుల వ్యవహారం మరిచిపోకముందే నాగబాబు కూతురు నిహారిక విడాకుల వ్యవహారం మెగా అభిమానులను నిరాశపరిచింది.

అయితే నిహారిక విడాకుల గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. జొన్నలగడ్డ చైతన్య – నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ చిన్నప్పటి నుండే మంచి స్నేహితులు. అంతేకాకుండా చిరంజీవి ఫ్యామిలీ మరియు చైతన్య ఫ్యామిలీకి ముందు నుండే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నిహారికను చూసి చైతన్య ప్రేమలో పడ్డాడు. ఇది కాస్త పెళ్లి వరకు దారి తీసింది. అయితే నిహారికను చైతన్య పెళ్లి చేసుకునే కంటే ముందే వరుణ్ తేజ్ నిహారిక గురించి కొన్ని విషయాలను చెప్పారట.

- Advertisement -

నిహారిక క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా కష్టమని.. ఆమె ఎప్పుడూ తనదే పై చేయి ఉండాలని కోరుకుంటుందని చెప్పారట. మా చెల్లి తో నువ్వు వేగడం కష్టమని నవ్వుకుంటూ చెప్పారట వరుణ్ తేజ్. ఓ సందర్భంలో నాగబాబు కూడా.. ఇన్నాళ్లు నిహారిక అల్లరి మేం భరించాం.. ఇకనుండి నువ్వు ఎలా భరిస్తావో అంటూ సరదాగా చైతన్యతో అన్నారట. అలా పెళ్లయిన కొంత కాలం పాటు బాగానే ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం నిహారికనే అని తెలుస్తోంది. ఆమె ఎప్పుడూ కూడా తన స్నేహితులతో పార్టీలు అంటూ తిరుగుతుందట. దీంతో ఆమెకు అడ్డు కట్ట వేయడం చైతన్యతో కాలేదు. ఈ కారణంగానే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు