Tollywood: మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న తరుణ్ ?

టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల క్రితం లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోల్లో తరుణ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడే ప్రేక్షకులకు బాగా దగ్గరైన తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటిలోనే మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సీనియర్ హీరో త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ లవర్ బాయ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం పడింది. వరుస అపజయాలు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి స్పందించారు. త్వరలోనే తరుణ్ పెళ్లి జరగబోతుందని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పింది.
ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అంటే దగ్గుబాటి, అక్కినేని, మెగా, నందమూరి ఫ్యామిలీసే. వీరిలో అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు. దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు ఉన్న తరుణ్ కంటే చాలా చిన్నది. నందమూరి ఇంట కూడా పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లలు లేరు. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ. అది కూడా శ్రీజ, నిహారిక. వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి ఉంటుందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు