Game changer: రామ్ చరణ్ సునీల్ మధ్య ఈ సీన్స్ కి పూనకాలే?

Ram Charan game changer update

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఒకటి “గేమ్ ఛేంజర్“. ఈ సినిమాపై రామ్ చరణ్ అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఓ రేంజ్ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. పైగా శంకర్ దర్శకత్వంలో చాలా ఏళ్ళ తర్వాత ఒక పొలిటికల్ సినిమా వస్తుండడంతో సినిమాలో మంచి బజ్ ఏర్పడింది. అయితే రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికీ పూర్తవలేదు. దాదాపు 80 శాతం వరకు షూటింగ్ కంప్లీట్ అయిందని నిర్మాత దిల్ రాజు అంటున్న మెగా ఫ్యాన్స్ నమ్మడం లేదు.

ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్డేట్ కూడా గేమ్ ఛేంజర్ నుండి రాలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీకాంత్, జయరాం, S.J సూర్య, నవీన్ చంద్ర, సునీల్, సముద్రఖని వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతుంది. అక్కడ రామ్ చరణ్ సునీల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఆ సీన్స్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉంటాయట. థియేటర్లో ఆ సీన్లకి విజిల్స్ పడటం ఖాయం అని షూటింగ్ చూసిన కొందరు అంటున్నారు. అయితే ఆ సీన్లు ఫైట్ సీన్ కావొచ్చా?, లేక డైలాగ్ సీన్ కావొచ్చా అనేది తెలియదు గాని ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అవడానికి మాత్రం రాబోయే సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు