Ramcharan: గేమ్ ఛేంజర్ ఫైట్ సీన్ షెడ్యూల్ కంప్లీట్.. సినిమాకి ఇదే హైలెట్?

Ramcharan Game changer:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ కి కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వగా, మళ్ళీ చిత్ర యూనిట్ మొత్తం ఒకటైంది. హీరో రామ్ చరణ్ సహా సినిమాలో భారీ తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, అంజలి సెకండ్ హీరోయిన్ గా నటించింది.

తాజాగా గేమ్ ఛేంజర్ లో ఒక కీలక ఫైట్ సీన్ ని కంప్లీట్ చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి కెజిఎఫ్ సినిమాకి పనిచేసిన ట్విన్ ఫైట్ మాస్టర్స్ అంబారివ్ బ్రదర్స్ పని చేస్తుడడం విశేషం. ఇక హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో గేమ్ ఛేంజర్ ఫైట్ సీన్ ని ఫినిష్ చేసారు. దాదాపు 1000 మందికి పైగా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్నారని సమాచారం. గేమ్ ఛేంజర్ లో ఇదే హైలెట్ ఫైట్ సీన్ అని మేకర్స్ అంటున్నారు. గతంలో రామ్ చరణ్ RRR లో ఇంట్రడక్షన్ ఫైట్ కి దాదాపు 1200 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారని తెలిసిందే.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, సమ్మర్ కల్లా సినిమా షూట్ పూర్తి అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఎందుకంటే మధ్యలో శంకర్ ఇండియన్ 2 షూట్ కూడా చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ లో రామ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా, అప్పన్న అనే రాజకీయనేతగా, రామ్ నందన్ ఐఏఎస్ గా రెండు షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్ రాజు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, 2024 సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు