Sivaji:
టాలీవుడ్ లో హీరో శివాజీ గురించి తెలియని వారుండరు. టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన ఆర్టిస్టుల్లో తాను కూడా ఒకడు. అయితే కాలం కలిసి రాకో, అదృష్టం తలుపు తట్టలేదో, తెలీదు గాని పెద్దగా పాపులర్ కాలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో చిన్న పాత్ర తో ఎంట్రీ ఇచ్చిన ఇతడు, ఫిల్మ్ నగర్, మిస్సమ్మ, శైలజా కృష్ణమూర్తి వంటి సినిమాల్లో హీరోగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత సినిమాలేవీ ఆడకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు.
సినిమాలో దాదాపు ఛాన్సులు తగ్గాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలుత బీజేపీ లో ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ళు ఉండగా, ఆ తర్వాత టీడీపీ లో కూడా కొన్నాళ్లు హంగామా చేసాడు. అయితే పాలిటిక్స్ లోను పెద్దగా ప్రభావం చూపించలేదు శివాజీ. తాజాగా ఎవ్వరు ఊహించని విధంగా బిగ్ బాస్ 7 లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు శివాజీ.
నిజానికి శివాజీ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లోనే ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు కాబట్టి ఫైనల్ గా బిగ్ బాస్ ని నమ్ముకుని పాపులర్ అవ్వాలని చూస్తున్నాడు ఈ హీరో. అయితే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తున్న మేల్ పర్సన్స్ లో శివాజీయే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కావడం విశేషం. అందువల్ల అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అది బిగ్ బాస్ లో శివాజీ బిహేవియర్ ని బట్టే ఉంటుంది మరి చూడాలి ఏం జరుగుతుందో.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.