Bigg Boss Season7: శివాజీ ఇలాగే ఉంటే కష్టమే – హీరో అన్న భ్రమలో నుండి బయటకురా..!

Bigg Boss Season7

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇటీవలే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో మెయిన్ అట్రాక్షన్ హీరో శివాజీ అని చెప్పచ్చు. సుమారు 96 సినిమాల్లో నటించిన శివాజీ, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్న శివాజీ బిగ్ బాస్ హౌస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ప్రస్తుతం శివాజీ తన కామెడీ టైమింగ్ తో, జోవియల్ నేచర్ తో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూన్నాడు. అయితే, హౌస్ లో కాఫీ లేకపోవటంతో సహనాన్ని కోల్పోయి బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యాడు శివాజీ. తర్వాత బిగ్ బాస్ శివాజీ బీపీ చెక్ చేయాలంటూ హౌస్ మేట్స్ కోరగా అందుకు ఒప్పుకోని శివాజీ, వెళ్ళిపోతానంటూ గోల చేశాడు.

ఆ తర్వాత జరిగిన ఫిజికల్ టాస్క్ లో అయితే, మినిమమ్ ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు శివాజీ. టేస్టీ తేజ, షకీలా లాంటి వాళ్ళు కూడా తమ స్టైల్ లో ప్రయత్నించగా శివాజీ మాత్రం కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టలేకపోయాడు. తాను హీరో అన్న భావనతో ఫస్ట్ వీక్ శివాజీని ఎవరూ నామినేట్ కూడా చేయలేదు. ఎంటర్నైనింగ్ యాస్పెక్ట్ అన్నది షో బిగినింగ్ లో హెల్ప్ అవ్వచ్చేమో కానీ, పోను, పోను ఇలాగే ఉంటే లాభం ఉండదు.

- Advertisement -

ఎపిసోడ్స్ గడిచే కొద్దీ కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గటంతో పాటు కాంపిటీషన్ టైట్ అయ్యే అవకాశం ఉంది. శివాజీ వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే గనుక పోను పోను చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. మరి, రీఎంట్రీ కోసం బిగ్ బాస్ లో అడుగు పెట్టిన శివాజీ, తాను అనుకున్నట్లు బిగ్ బాస్ ఫైనల్స్ కి చేరుకొని కప్ అందుకుంటాడా లేదా చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు