Srinu Vaitla: గోపీచంద్ చిత్ర ప్రొడ్యూసర్ ని స్పెషల్ గా విష్ చేసిన నాగ చైతన్య!

Srinu Vaitla:

మ్యాచో స్టార్ గోపిచంద్ ఎంటెర్టైన్మెంట్ మాస్ డైరెక్టర్ శ్రీను వైట్ల తో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ కాంబో గురించి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకపోయినా అనుకోకుండా కుదిరిందనిచెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 9న ఈ సినిమా గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా జరుపుకుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత గోపి మోహన్ కథ అందిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని కొత్త నిర్మాణ సంస్థ “చిత్రాలయం ప్రొడక్షన్ హౌస్” పేరిట వేణు దోనేపూడి అనే నిర్మాత తీస్తున్నాడు. తాజాగా అక్కినేని నాగచైతన్య చిత్ర యూనిట్ ని కలిసి తన స్పెషల్ విషెస్ అందచేసాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని గోపీచంద్ కి మంచి బ్లాక్ బస్టర్ రావాలని, శ్రీను వైట్ల మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి వరుస సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక నాగ చైతన్య ఇలా స్పెషల్ గా విష్ చేయడం పట్ల తొందర్లోనే ఈ బ్యానర్ లో చెయ్ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వినబడుతున్నాయి.

ఇక గోపీచంద్ శ్రీనువైట్ల కాంబో లో వస్తున్న ఈ సినిమాకి ఇంకా స్టార్ క్యాస్ట్ ఏమి ఫిక్స్ కాలేదు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ లోపు గోపీచంద్ నటిస్తున్న భీమా సినిమా రిలీజ్ చేసేస్తారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు