Bigboss7:
టెలివిజన్ లో బిగ్ బాస్ సందడి మొదలైనప్పటినుండి సీరియళ్ల ప్రభావం తగ్గిపోయింది. అంతగా బిగ్ బాస్ కి అడిక్ట్ అయిపోయారు తెలుగు ఆడియన్స్. అయితే బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పల్టా గా నడుస్తుందని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఆడియన్స్ కి కనెక్ట్ అవడానికి టైం పట్టింది. ఇక ఈ సీజన్లో గొడవలు కూడా ముందే మొదలయ్యాయి. వాటిని గొడవలు అనడం కంటే చిల్లర వేషాలు అని కూడా అనవచ్చేమో.
ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్లో నామినేషన్ల ప్రక్రియ వచ్చినపుడు మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా నామినేషన్లో నిలుస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ నామినేషన్ లో ఎక్కువ మంది ప్రశాంత్ ని నామినేట్ చేయగా,ఆడియన్స్ నుండి ఎక్కువగా ఓట్లు కూడా తనకే వచ్చాయి. అయితే అవి తన ఆట తీరుని బట్టి కాకుండా ఫ్యాన్ బేస్ ప్రకారం, ఇంకా చెప్పాలంటే సింపతీ ఓట్లు గా వచ్చాయని అనిపిస్తుంది.
రెండో వారం లో కూడా ప్రశాంత్ తో పాటు టీవీల్లో పాపులర్ అయిన నటీనటులకే ఎక్కువగా రావడం జరిగింది. అయితే ఆట ప్రకారం వీరందరూ వారి వారి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. కానీ అందరికంటే బెస్ట్ గా, ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ లలో బాగా ఆడుతుంది ప్రిన్స్ యావర్. పైగా జెన్యూన్ గా ఆడుతున్న ఒకే ఒక్కడు.
బిగ్ బాస్ లోకి వచ్చే వరకు ఇతనెవరో దాదాపు జనాలెవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు తన ఆట తీరుతో జనాల్ని ఆకర్షిస్తున్నాడు యావర్. అంతే కాదు ఒక రకంగా బిగ్ బాస్ లో కేవలం ఆట ప్రకారం ఓటింగ్ వేస్తె యావర్ కే ఎక్కువ ఓట్స్ వస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికైనా ఫ్యాన్ బేస్ తో కాకుండా వారం వారం బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చే వారికే వోట్ వేయాలని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.