Bigboss season 7: షకీలా చెప్పిన మాట యావర్ వింటాడా?

Bigboss season 7:

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్స్ అందరు బాగా ఆడుతున్నా, ఎక్కువగా గొడవపడుతుండడం ఆడియన్స్ కి కొంత వరకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ మెల్లిగా అందరు ఒకటవడం కూడా శుభ పరిణామం. ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి మొదటి వారం పూర్తయ్యాక కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవగా, రెండవ వారం షకీలా ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ లో భాగంగా షకీలా కి హౌస్ కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలాంటి వారో, ఎవరిలో ఏ లోపం ఉందొ చెప్పమని నాగార్జున అన్నారు.

ఆ ప్రాసెస్ లో భాగంగా నాగార్జున అడక్కపోయినప్పటికీ షకీలా ప్రిన్స్ యావర్ ని తానే గొప్ప అనుకుంటాడని ట్వీట్ చేసింది. తాను వెళ్లిపోయేటప్పుడు కూడా ప్రిన్స్ ని ఆట పరంగా పొగుడుతూ యావర్ అందరి కంటే బెస్ట్ ప్లేయర్ అంటూ, తన లోపం తానే గొప్ప అనుకుంటాడని అని అని అంది. ఆ ఆవేశాన్ని అణుచుకుంటే తాను బిగ్ బాస్ లో మరింత ముందుకు వెళ్తాడు అంది. అటు యావర్ కూడా తన ఆవేశాన్నీ తగ్గించుకుంటానని అంటూ, బయటికి వచ్చాక తనని పిలుస్తారు కాదా అమ్మా అని అన్నాడు. దానికి షకీలా కూడా రిప్లై ఇస్తూ తప్పకుండా పిలుస్తానంటూ, హిందీలో సమాధానమిచ్చింది.

ఇటు ఆడియన్స్ ఆలోచనల్లో కూడా ప్రిన్స్ బాగా ఆడుతున్నా, తన ఆవేశం వల్లే ఎక్కువ నామినేషన్ లో నిలుస్తున్నాడని తెలుస్తుంది. అంతే కాదు నాగార్జున మాట్లాడుతున్నప్పుడు కూడా ఓ సందర్భంలో యావర్ తగ్గలేదు. మరి ఈ లోపాన్ని సరి చూసుకుని యావర్ ఎంత వరకు ముందుకెళ్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు