Mega 156: ఎట్టకేలకు ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్న మెగాస్టార్ – వశిష్ఠ సినిమాలో క్యారెక్టర్ ఇదే..!

Mega 156

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత  వరుసగా సినిమాలు చేస్తూ, యంగ్ లుక్స్ తో గ్రెస్ ఫుల్ డ్యాన్స్ లతో యంగ్ హీరోస్ కి పోటీ ఇస్తుండటం ఆనందపడాల్సిన విషయమే అయినప్పటికీ ఈ వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ తో డ్యూయెట్స్ ఏంటంటూ కామెంట్స్ వస్తుండటం నిరాశ కలిగిస్తోంది.
కామెంట్స్ మాట అటుంచితే, మోహన్ లాల్, రజినీకాంత్ వంటి సీనియర్ హీరోలు తమ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తరుణంలో చిరు భోళాశంకర్ లాంటి రొటీన్ రొట్ట రీమేక్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకోవటం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.
భోళాశంకర్ సినిమా తర్వాత హార్డ్ కొర్ మెగాఫ్యాన్స్ కూడా ఇక చిరు యంగ్ లుక్స్ కోసం శ్రమ పడటం మానేసి ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ చేయాలని రిక్వెస్ట్ చేసే స్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో వశిష్ఠతో చేయబోయే సోషియో ఫాంటసీ సినిమా ద్వారా మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చిరు తన ఏజ్ కి తగ్గ లుక్స్ తో ఇమేజ్ కి తగ్గ క్యారెక్టరైజేషన్ లో కనిపించనున్నాడని డైరెక్టర్ వశిష్ఠ క్లారిటీ ఇచ్చాడు.
అప్పట్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా ఆ జెనరేషన్ కి క్లాసిక్ గా ఎలా గుర్తుంటుందో ఇప్పటి జెనరేషన్ కి ఈ సినిమా క్లాసిక్ గా నిలిచిపోతుందని భరోసా ఇచ్చాడు. భోళాశంకర్ డిజాస్టర్ తో ఢీలా పడ్డ మెగా ఫ్యాన్స్ కి వశిష్ఠ స్టేట్మెంట్స్ కొత్త ఆశలు చిగురింప జేస్తున్నాయి. మొత్తానికి ఆలస్యంగా అయినా ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్న మెగాస్టార్ కి వశిష్ఠ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుతుందో లేదో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు