Mahesh babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం పై ఒక క్రేజీ బజ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అంత ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలోని మొదటి పాటను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అయితే ఇటీవలనే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం సినిమాలోని మొదటి పాట రిలీజ్ అవ్వాల్సి ఉండింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆ సాంగ్ రిలీజ్ కు కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు చేసాడు కానీ చివరలో మహేష్ బాబు కు పాట నచ్చకపోవడం తో ఆ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. ఆ తరువాత మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లి వచ్చాడు. ఇక అప్పటి నుంచి గుంటూరు కారం షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటునే ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాను ఖచ్చితంగా సంక్రాంతిగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ బలంగా ఫిక్స్ అవడంతో మహేష్ బాబు కూడా బ్రేక్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇక ఈ సినిమాలోని మొదటి పాటను ను కూడా ఇటీవలనే మహేష్ బాబు ఒకే చేశారట దాంతో మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఆ పాటకు సంబంధించి ఫైనల్ మిక్సింగ్ పనుల్లో ఉన్నాడని సమాచారం అందుతోంది. అయితే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరు కారం మొదటి పాటను అక్టోబర్ 1 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తోంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.