Bigg Boss Season7: రతికకు రైతు బిడ్డ ఉసురు తగిలిందా..?

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్7 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్స్ కంటే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ యాక్టివ్ గా ఉండటంతో గేమ్ లో చాలా చేంజెస్ చేయటం వల్ల ఫస్ట్ వీక్ నుండే షో ఆసక్తిగా సాగుతోంది. ఈ సీజన్ కి ఉల్టా పల్టా అన్న ట్యాగ్ పెట్టి ఆడియెన్స్ అంచనాలకు అందని రీతిలో షో నడపాలని టీమ్ ప్లాన్ చేసింది.

ఎలిమినేషన్స్ కూడా ఈ సీజన్లో ఆడియెన్స్ అంచనాలకు అందకుండా జరుగుతున్నాయి. ఈ వీక్ హౌస్ నుండి టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని భావించగా రతిక ఎలిమినేట్ అయ్యింది. రతిక హౌస్ లోకి ఎంటరైనప్పటి నుండి యాక్టివ్ గా ఉండటమే కాకుండా షో కి గ్లామర్ యాడ్ చేసింది.

రైతు బిడ్డ ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రొజెక్ట్ అవ్వటం రతిక కి మైనస్ అయ్యిందని చెప్పాలి. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో రతిక పర్సనల్ ఫోటోస్ బయటికి రావటం కూడా నెగిటివిటికి దారి తీసింది. ప్రశాంత్ తో స్టార్టింగ్ లో క్లోజ్ గా ఉన్న రతిక ఆ తర్వాత రివర్స్ అవ్వడం పట్ల ఆడియెన్స్ నెగిటివిటి పెరగటానికి దారి తీసింది.

- Advertisement -

ప్రశాంత్ ని తక్కువ చేసి చూడటం, పర్సనల్ గా అతన్ని అటాక్ చేయటం కూడా నెగిటివ్ గా ప్రొజెక్ట్ అయ్యిందని చెప్పాలి. ఆ రకంగా మొత్తానికి ప్రశాంత్ తో గొడవలే రతిక ఎలిమినేషన్ కి దారి తీశాయని మెజారిటీ ఆఫ్ ఆడియెన్స్ అంటున్నారు. రతిక ఎలిమినేషన్ పట్ల కొంత మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతోంటే, ఇంకొంత మంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు