Bigg Boss Season7: సందీప్ పై వరుస పంచులతో గాలి తీసేసిన నాగ్..!

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ పవర్ అస్త్ర టాస్క్ లో విన్ అయ్యి హౌస్ మెట్ గా అర్హత సాధించాడు కొరియోగ్రాఫర్ సందీప్. ఫస్ట్ వీక్ సందీప్ గేమ్ పాజిటివ్ గా ప్రొజెక్ట్ అయినప్పటికీ ఆ తర్వాత నుండి సంచాలక్ గా ఫెయిల్ అవ్వటం, బయాస్డ్ గా ఉంటూ సేఫ్ గేమ్ ఆడటంతో సందీప్ గ్రాఫ్ మెల్లిగా తగ్గుతూ వస్తోంది.

ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా సందీప్ మిస్టేక్స్ ని ఎండగడుతూ వరుస పంచ్ లతో గాలి తీసేసినంత పని చేసాడు. గౌతమ్, తేజ ఇష్యూలో సైలెంట్ సంచాలక్ గా ఉన్న సందీప్ ఆ సమయంలో సైలెంట్ గా ఉండి నాగార్జున ఆ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం తేజాని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయటం బెటర్ అని చెప్పగా నాగ్ కంటెస్టెంట్స్ ని ఇంటి నుండి బయటికి పంపాల్సింది ఆడియెన్స్ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఇష్యూలో సందీప్ దే ఎక్కువ తప్పు అని, ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఫస్ట్ నిన్ను చేయాలని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత జ్యూరీ మెంబర్ గా ఉన్న సమయంలో శివాజీతో కాకుండా కేవలం శోభ శెట్టితో మాత్రమే డిస్కస్ చేసి డెషిషన్స్ తీసుకోవటాన్ని కూడా నాగ్ ఖండించాడు.

- Advertisement -

ఆ తర్వాత ఫన్నీ టాస్క్ సమయంలో కూడా అమర్ దీప్ పట్ల పార్షియల్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. అంతే కాకుండా తేజకి గుడ్డి గొర్రె ట్యాగ్ ఇచ్చినప్పుడు కూడా, టాస్క్ సమయంలో సంచాలక్ గా ఉండి కూడా సైలెంట్ గా ఉన్నందుకు నీకె ఇవ్వాలి ఆ ట్యాగ్ అని సెటైర్ వేశాడు. ఆ రకంగా ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సందీప్ ని కడిగేశాడు. ఇక మీదటైనా సందీప్ పర్ఫామెన్స్ ఇంప్రూవ్ అవుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు