టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల రాశి…. హీరోయిన్ శ్రీలీలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ శ్రీ లీల. వాస్తవానికి తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటి… పుట్టి పెరిగింది మాత్రం కర్ణాటక రాష్ట్రంలోనే. అయితే ఈ అందాల రాసి శ్రీ లీల సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
శ్రీ లీల ‘పెళ్లి సందD’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత బోలెడన్ని అవకాశాలను అందుకుంది. అంతేకాకుండా 10 సినిమాలకు సైన్ కూడా చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్లు ఉన్న తగ్గేదేలేదు అన్నట్లు రోజురోజుకు తన ఆఫర్లను పెంచుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మొదట్లో నేను డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు సినిమాలో నటిస్తూ డాక్టర్ చదువు చదవడం చాలా చాలా కష్టం….మార్నింగ్ షూటింగ్స్ చేసుకొని రాత్రులు చదువుకుంటూనే ఉంటాను. కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ రెండు ఇష్టంగా చేయడంతో నాకు ఆ బాధ తెలియడం లేదు. కొన్నిసార్లు ఇది తప్పు అని తెలుసు కానీ తప్పక తప్పు చేయడం తప్పడం లేదు అంటూ వెల్లడించింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News