Ghost: రేసు నుంచి తప్పుకున్న శివన్న..

 

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ లో పెద్ద స్టార్ అయిన ఈయన తెలుగులో డబ్బింగ్ సినిమాల ద్వారా పలకరిస్తూనే ఉంటాడు. లాస్ట్ ఇయర్ వేద సినిమాతో ఆడియన్స్ ని మెప్పించగా, ఈ ఏడాది రజినీకాంత్ జైలర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిశాడు. ఆ సినిమా క్లైమాక్స్ లో రజినీకాంత్ తో ఈక్వెల్ గా స్క్రీన్ ని షేర్ చేసుకోవడం విశేషం.

ఇక ఈ ఏడాది “ఘోస్ట్” సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమవుతున్నాడన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మెప్పించగా, దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో ఘోస్ట్ మూవీ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా ఘోస్ట్ మూవీ రిలీజ్ కావడం లేదని తెలిసింది. ఈ దసరాకి తెలుగులో రిలీజ్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, లియో సినిమాల పోటీ వలన ఘోస్ట్ సినిమా రేస్ నుండి తప్పుకున్నట్టు సమాచారం.

- Advertisement -

అయితే కన్నడ వెర్షన్ మాత్రం అనుకున్న టైం కి అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది. ఇక తెలుగులో “ఘోస్ట్” సినిమా అక్టోబర్ 27న రిలీజ్ అవుతున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేయడం జరిగింది.

అయితే కన్నడలో హిట్ టాక్ తెచ్చుకుంటే, తెలుగులో ఘోస్ట్ రిలీజ్ టైం కి బిజినెస్ లెక్కలు మారే ఛాన్స్ ఉంది. గతంలో కాంతారా సినిమా కూడా ముందుగా కన్నడ లో హిట్ అయిన తరువాత తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు