Bigg Boss Season 7: ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఈ ఇద్దరే..!

బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ కంటే ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఈ సీజన్ కి ఉల్టా పల్టా ట్యాగ్ లైన్ తో గేమ్ లో చాలా చేంజెస్ చేయటం వల్ల ఫస్ట్ వీక్ నుండే ఆసక్తిగా సాగుతోంది షో. కంటెస్టెంట్స్ హౌస్ మెట్ అయ్యే అర్హత సాధించాలంటే టాస్క్ లో విన్ అవ్వాలంటూ పెట్టిన కండిషన్ వల్ల కంటెస్టెంట్స్ అందరు టాస్క్ లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఎప్పుడు లేని విధంగా ఈసారి హౌస్ లోకి 5మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని పంపడం ఆసక్తిగా మారింది. ఈ సీజన్లో ఎలిమినేషన్స్ కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి. షో స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ నుండి వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వటం షాక్ కి గురి చేసింది.
అయితే, ఈ వారం నామినేషన్స్ లో 7మంది కాన్స్టెంట్స్ ఉండటం మరింత ఉత్కంఠగా మారింది. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో కొత్తగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండటం ఆసక్తిగా మారింది. ఈ వీక్ డేంజర్ జోన్ లో అశ్విని, భోలే, పూజలు ఉన్నారు. వీరిలో అశ్విని సేవ్ అయ్యే అవకాశం ఉండగా భోలే, పూజలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ వీక్ కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే గనక వరసగా 7వారాలు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్లు అవుతుంది. అయితే, హౌస్ లోకి ఎంటరైన నాటి నుండి భోలే బ్రెయిన్ లెస్ గా గేమ్ ఆడుతున్నాడు. భోలే బ్రెయిన్ లెస్ గా ఉండటం ఫన్ జెనరేట్ చేస్తున్నప్పటికీ అతనికి నెగిటివిటి కూడా తెచ్చి పెడుతోంది. మరి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు