విజయ్ దేవరకొండ అతి తక్కువ టైం లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న హీరో. అర్జున్ రెడ్డి ,గీతగోవిందం, టాక్సీవాలా లాంటి హిట్ సినిమాలు తరువాత డియర్ కామ్రేడ్ ,వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు వరుసగా దెబ్బ కొట్టాయి. కానీ ఇప్పటికి విజయ్ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తరువాత విజయ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ కు సిద్దమవుతుంది.
విజయ్ దేవరకొండ హిందీలో చేస్తున్న మొదటి చిత్రం లైగర్. విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో సినిమాను చేయకపోయినా విజయ్ కు బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉంది. చాలామంది యంగ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని, లేదా తనతో డేటింగ్ చేయాలని ఉందంటూ తమ మనసులోని మాటను బయటపెట్టారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ యాడ్ అయ్యింది.
రీసెంట్ గా ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ ప్రారంభమయ్యింది. రీసెంట్ ఎపిసోడ్లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి పాల్గొన్నారు. ఇటీవల ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యింది. ఇందులో కరణ్.. సారాను ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని అడగగా.. ముందు తను చెప్పడానికి నిరాకరించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. జాన్వీ కూడా ఇదివరకే విజయ్ దేవరకొండ పేరు చెప్పిందని తెలియని సారా షాక్ అయ్యింది.
ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనగణమన సినిమాలను చేస్తున్నాడు.
https://twitter.com/karanjohar/status/1546754111172816896?s=20&t=frPFTWlPPDdKaGZpSPYWDA