Mega Family: వరుణ్ తేజ్ కంటే ముందే లావణ్య త్రిపాఠి మరో అబ్బాయిని ప్రేమించిందా..?

మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లోనే భార్య భర్తలు కాబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒకటి కానుంది. ఈ క్రమంలో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు సాగుతున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వరుణ్ – లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంట్లో మరోసారి ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. వీరి పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

సుమారు ఆరేళ్ల పాటు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారు. మిస్టర్ సినిమా చేస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. నవంబర్ 1వ తేదీన వీరి పెళ్లి అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో లావణ్య కి సంబంధించిన ఓ వార్తని ట్రోల్స్ చేస్తున్నారు. అదేంటంటే.. వరుణ్ కంటే ముందే ఓ హీరోని లావణ్య ప్రేమించిందని, ఆ హీరోని డబ్బు కారణంగానే వదిలేసిందని జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఆ హీరో మరెవరో కాదు నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమా ద్వారా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం కొనసాగిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అయితే ఏమైందో తెలియదు కానీ లావణ్య నవీన్ ని వదిలేసి వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. దీంతో ఈ న్యూస్ ని ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తూ లావణ్య పై కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు