Fruits For Kidney Health: కిడ్నీ హెల్త్ కోసం ఏ పండ్లు తినాలంటే..!

మన బాడీలో హార్ట్ తర్వాత అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏదంటే అవి కిడ్నీస్ అనే చెప్పాలి. బాడీలోని వ్యర్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపి బ్లడ్ ని ప్యూరిఫై చేయటంలో కీలక పాత్ర వహిస్తాయి కిడ్నీలు. ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ లో వచ్చిన డ్రాస్టిక్ చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కిడ్నీ పేషేంట్స్ రోజురోజుకి ఎక్కువవుతున్నారు. అంతటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే కిడ్నీస్ ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఈ కింద మెన్షన్ చేసిన పండ్లను మన రోజు వారి డైట్ లో చేర్చుకుంటే కిడ్నీస్ ని హెల్తీగా ఉంచుకోవచ్చు.

స్ట్రా బెర్రీస్:

స్ట్రా బెర్రీస్ లో ఉండే పోషకాల వల్ల కిడ్నీ పని తీరు మెరుగు పెడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. స్ట్రా బెర్రీస్ లో ఉండే విటమిన్ C, మ్యాంగనీస్, ఫైబర్ కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి దోహద పడతాయి. స్ట్రా బెర్రీస్ క్రమం తప్పకుండ తీసుకోవటం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు.

క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్ లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా హెల్ప్ అవుతాయి. వీటిని క్రమం తప్పకుండా మన డైట్ లో చేర్చుకోవటం వల్ల కిడ్నీస్ ని హెల్తీగా ఉంచుకోవచ్చని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు.

బ్లూ బెర్రీస్:

ఒక కప్ బ్లూ బెర్రీస్ లో 114గ్రాముల పొటాషియం, 18మిల్లి గ్రాముల పాస్ఫరస్ ఉంటాయి, ఇవి కిడ్నీ పనితీరుని మెరుగుపర్చటంలో దోహద పడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండటంతో కిడ్నీ హెల్త్ కి చాలా హెల్ప్ అవుతాయి. బ్లూ బెర్రీస్ లో కూడా విటమిన్ C, మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి స్కిన్, బోన్ అండ్ కిడ్నీ హెల్త్ కి హెల్ప్ అవుతాయి.

రాస్ప్ బెర్రీస్:

రాస్ప్ బెర్రీస్ లో ఉండే పోషకాలు సెల్ డ్యామేజ్ సమస్య నుండి కాపాడతాయి. వీటిలో ఉండే ఫ్లెవనాయిడ్స్ కిడ్నిల పనితీరుని మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా వీటిని మన డైట్ లో చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు.రాస్ప్ బెర్రీస్ లో కూడా విటమిన్ C, B, మ్యాంగనీస్, ఫైబర్, పుష్కలంగా ఉంటాయి కాబట్టి కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవటానికి దోహద పడతాయి.

యాపిల్స్:

ఒక మీడియం సైజు యాపిల్ లో 195 మిల్లీగ్రాముల పొటాషియం, 20మిల్లీ గ్రాముల పాస్ఫరస్ ఉంటాయి, ఇవి కేవలం కిడ్నీ హెల్త్ ని ఇంప్రూవ్ చేయటమే కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. యాపిల్స్ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. యాపిల్స్ వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా దూరమవుతుంది కాబట్టి కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి.

గ్రేప్స్:

ఒక కప్ గ్రేప్స్ లో 288మిల్లీ గ్రాముల పొటాషియం, 30మిల్లీ గ్రాముల పాస్ఫరస్ ఉంటాయి కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల కిడ్నీ హెల్త్ మెరుగవుతుంది. గ్రేప్స్ లో విటమిన్ C, K పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా గ్రేప్స్ ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు.

పైనాపిల్స్:

పైనాపిల్స్ లో ఉండే బ్రోమేలైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు హెల్ప్ అవుతుంది. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి కిడ్నీ సమస్యలకు కారణమయ్యే లోబీపీ వంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. పినాపిల్స్ లో విటమిన్ C కూడా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్..!

సిట్రస్ అధికంగా ఉండే ఆరెంజెస్, లెమన్, వంటి ఫ్రూట్స్ కూడా కిడ్నీ హెల్త్ ని మెరుగు పరిచేందుకు దోహద పడతాయి. వీటిని క్రమం తప్పకుండ తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు